పుట:ఆముక్తమాల్యద.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చలి = 1. సీతు 2. జంకు
చల్లువెద = పిడికిళ్లతో చల్లకము
చవి = 1. స్వాదిమ, 2. ముత్తెము బరువు
చాఁగు = ఏఁగు
చాఁపట్టు = పలుచని యట్టు
చిట్టరము = కపటము
చెండాడు = చెండు, కొఱుకు
చెడదు = విడదు
చెఱకడము = బెల్లము
చెల్కు = బీటినేల
చేమమడి = చేమకాడలపొలము
ప్రకరణోచితార్థములు
చొచ్చు = ఇచ్చగించు
చౌతు = కళ్లాయి
చౌదంతి = నాలుగుకొమ్ముల యేనుఁగు
చౌరుకొట్టు = వాసనకొట్టునట్లు నమలు

ఛత్రాకము = పుట్టగొడుగు

జంభలము = నిమ్ము
జక్కులబోనము = మిథ్యాభోజనము
జజ్జుకొను = జజ్జుపడు
జడను = ఆలస్యము, జాడ్యము
జల్లులు = జాలరులు
జాంగలము = మెట్టచేను
జానుదిఘ్న = మోకాలిబంటి
జాలి = ఖేదము, వెత
జిలుగుపని = స్వల్పకార్యము
జీలుఁగు = ఒక చెట్టు పేరు
జూటుఁదనము = మోసము
జెన = గ్రుడ్లసమూహము
జోడన = జంట
జౌకుమడి = బురదకయ్య
జ్ఞప్తి = నిద్రనుండి మెలఁకువ

టంకసాలవాటులు = నాణెములు
టెక్కి = టోపి

డంబు = వేషము
డింగరీఁడు = భక్తుఁడు
డాత్కూటము = చేఁదు చేఁప
డోఁగు = డోఁగు = మోకాళ్లపైన నడుచు

తక్కుము = విడుము
తగడు = రేకు
తగులము = ఆడ్డు
తడ = విరోధము
తడుకు = వెలుగు
తతము = వీణె
తరూర్ధ్వచ్ఛాయ = పైకి వ్యాపించు అతనికాంతి
తని = సన్నని
తనుపారు = చల్లనైన
తపారము = టోపి
తరవాయి = ఉపక్రమించి జరుపుచున్నట్టిది
తరకసము = అమ్ములపొది
తఱియు = చొచ్చు
తల = మీఁద
తలరి = ఉంకించి
తాచిన = చెక్కిన
తాపలు = మెట్లు
తిమ్మనము = మజ్జిగ పులుసు
తియ్యము = ప్రియము
తివియించు = యుదోపిడి చేయించు
తుసికిలు = జాఱు