పుట:ఆముక్తమాల్యద.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కీకటులు = మ్లేచ్ఛులు
కీకసము = పచ్చియెముక
కీలుమదము = కీలు (వన్నె-నలుపైన) మదము
కీల్కొనన్ = నాటునట్లు
కుండము = కొలను, కుండ
కుట్టుసురు = కొఱప్రాణము
కుప్పసము = ఱవిక
కుబుసము = చొక్కా
కుఱు = చిన్న
కూపెట్టు = మొఱయిడు
కెలసము = పని, హేతువ
కెళవు = ప్రక్క, పార్శ్వము
కేదారము = శిరస్త్రము (helmet)
కేరడము = పరిహాసము
కైజా = కళ్ళేము
కైశికము = టక్కు
కొట్టికాఁడు = వేగులవాఁడు
కొడిమె = నింద
కొదవెట్టు = లోపము కల్పించు
కొప్పెర = కటాహము
కోటియిడు = వేగు ఉంచు
కోరు = ధాన్యరూపమైన పన్ను
కోలము = వేషము
క్రంత = పెండ్లికొడుకువారు పెండ్లికూఁతునకు
      తీసికొనిపోవు ప్రధానద్రవ్యసముదాయము
క్రందుగా = దొమ్మిగా
క్రాయు = ఉమియు, కక్కు

ఖంజన = కాటుకపిట్ట
ఖని = గని
ఖనిత్రము = గడ్డపాఱ
ఖలూరిక = గరిడీ

గంట = పైరుదుంప
గంటు = ముడి
గండె = మత్స్యము
గంధర్వము = గుఱ్ఱము
గచ్చు = పూఁత
గడి = ఎల్ల
గనెలు = ఖండములు
గరిగ = చిన్న పాత్ర
గరుసు = పచ్చితోలు
గల్లము = చెక్కిలి
గామిడి = శ్రేష్ఠము
గిరిక = చిట్టెలుక
గిఱవు = కుదువ
గుట్టుకీడు = గూఢశత్రువు
గుఱి = గుఱుతు
గూడ = బుట్ట
గొంతుక్రోల్ = కంఠనాళము
గోపిక = కావలియాడుది
గోము - సౌకుమార్యము
గోలగగ్గెర = కాళ్లు చేతులు పసరమువలె చేర్చి కట్టుట
గౌదకట్టు = చెంపలను మూసి కట్టిన గుడ్డ

ఘరట్టము = తిరుగలి పైరాయి
ఘుణ = మ్రానుతొలుచు పురుగు

చండాతకము = చల్లాడము
చంద్రము = సిందూరము
చక్కఁజేయు = ముగించు, చంపు.
చదుము = చదును ప్రదేశము
చనుమఱ = చన్నునలుపు