పుట:ఆముక్తమాల్యద.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐకకంఠ్యము = ఏకాభిప్రాయత్వము

ఒండె = ఒక్కటె
ఒదర్చు = ఊడలాగు
ఒదుగుగా = సమృద్ధిగా
ఒరుము - చుఱుకెక్కు
ఒరుదలకాఁడు = కొండెగాఁడు
ఒఱయిడు = ఆలోచన చేయు
ఒట్టు = అంటు
ఒడ్డు = నిడుపు
ఒల్లఁబోవు = మూర్ఛిల్లు

ఓటము = పరాజయము
ఓహరిసాహరి = తండోపతండము, నేను ముందు నేను ముందు అని.

ఔరు = పెల్లగిల్లరాని గంట

కంకణము = 1. గాజు
               2. కంకణాయి పక్షి
కంకము = గద్ద
కంటకిత = 1. గగుర్కొన్న
             2. ముండ్లుగల
కందనకాయ = గుండెకాయ
కందు = నొచ్చు
కుండము = 1. సరస్సు
               2. కుండ
కక్కసము = బలవంతము
కటకాముఖము = బాణముపట్టుకొన ననువగు పిడికిలి
కట్టావి = 1. పొగ, 2. మిక్కిలి వేడి
కడ = చావు
కడార = పసుపుపచ్చ
కడార కాచకటకము = పచ్చని లక్కగాజు
కనరు = ఒగరు
కనుగలుగు = చక్కఁగ పరికించు
కన్కిసరు = అసూయ
కన్దళుకు నేత్రధాళధళ్యము
కన్ను = 1. మృదంగవాద్యముఖపు బిళ్ల
           2. జాడ
కపోణి = మోచేయి
కమన = కామించువాఁడా
కరక = వడగల్లు
కరభము = మనికట్టు మొదలు చిటికెనవ్రేలివఱకు
        గల చేతి బయటిభాగము
కరవటము = బరణి
కరి = సాక్షి
కరుళ్లు = గడ్డలు
కర్కటిక = దోస
కఱ(ఱ్ఱ,ఱు)కుట్లు = ఇనుపసలాకయందు గ్రుచ్చి కాల్చెడు
         మాంసఖండము, శూల్యము
కల్పు = కరంచు
కవురుమానిసి = కపటముగలవాఁడు
కసీసము = మైలుతుత్తపు నలుపు
కాంబవ = కంబు (= శంఖము) యొక్క
కాడుపడి = దారి తప్పి, దిగ్భ్రమ చెంది
కానన్ = ఎఱుంగునట్లు
కార = చెఱసాల
కారుకుఁడు = శిల్పి
కావులు = కావివస్త్రములు
కిటకిటన = కృశము
కిట్టు = తగులు
కిరి = వరాహము