పుట:ఆముక్తమాల్యద.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆయతికాఁడు = ధనమార్జింపవలసినవాఁడు
ఆరు = తృప్తిపడు
ఆలాపిని = తంబురా
ఆపులు = ఆవిరులు
ఆద్యము = శ్రేష్ఠమైనది
ఆర్చు = ఆడించు = పలికించు
ఆర్తి= ఇబ్బంది

ఇంగాలము = బొగ్గు
ఇడియు = చిదుగు, కూలు
ఇడుపు = ద్వారపార్శ్వము
ఇతరేతర = ఒండొరులతో
ఇనుఁడు = 1. సూర్యుఁడు 2. రాజు
ఇరమ్మదము = మేఘములోని జ్యోతి
ఇచ్చకులు = ఇచ్చకముగా నడుచువారు.

ఈఱము = పొద
ఈలకఱచు = ప్రాణము బిగబట్టు
ఈలువు =మానము
ఈషి = చూచు (= తలఁచు)వాఁడు

ఉదస్తు = పనినుండి తొలఁగింపఁబడినవాఁడు
ఉదార = పెద్ద
ఉదుటు = ఉద్ధతి
ఉపాంశున = రహస్యముగా
ఉబుసుపోక = విరామకాలక్షేపము
ఉరవు = ఉచితము
ఉలుకు = జంకు
ఉలుచ = చిన్న దేవ
ఉలుపాలు = కానుకలు
ఉచ్ఛూనము = కలుజు
ఉత్పాతము =లోకస్వభావమునకు విపరీతమైనది
ఉత్సేకము = గర్వము
ఉద్గారము = త్రేన్పు
ఉమ్మనీరు = ఉబ్బనీరు, ప్రసవజలము
ఉల్లసము = పరిహానము
ఉల్లెడ = మేలుకట్టు

ఊఁదు = ఊను
ఊర్జస్వలుఁడు = మిక్కిలి తేజోవంతుఁడు

ఋతువేళ = ఋతుస్నానవేళ

ఎదకాఁడు = కుంటెనకాఁడు, తార్పుకాఁడు
ఎడవు = దూరము
ఎరవు = సొంతముకాని, లాఁతితనము, తాత్కాలికజీవనము
ఎఱ = మేత
ఎలగోలు = మొదట కురిసినది, వాన
ఎత్తు = దండ
ఎవ్వ = ఏవ, లేమి

ఏకాంగి = ఆలుబిడ్డల వదలి, కావివస్త్రములు దాల్చి
        భగవత్కైంకర్యము చేయు విరక్తుఁడు
ఏతరి = నీతిమాలినవాఁడు
ఏపిరి = హద్దు
ఏరుసాగు = దున్ను