పుట:ఆముక్తమాల్యద.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొన్ని శబ్దములకు

ప్రకరణోచితార్థములు

(GLOSSARY)

అంకకాఁడు = చలపాది
అంకెవన్నె = రౌతు కాలుంచి యెక్కుటకు గుఱ్ఱమునకు పార్శ్వమున వ్రేలఁగట్టెడి
                యినుపవలయముతోడి వారు
అంచపదము = వ్రాఁతలో నడుమ అక్షరవష్టి సూచక చిహ్నము.
అంజనము : 1. ఆపేరి యేనుఁగు.
               2. మాలిన్యము.
               3. కందెన.
అంట = గుంపు
అంతిక = ప్రొయ్యి
అందంబు గూడుకొను = వానితో తానును చేరు
అందు = అందుచున్న; అనుచున్న
ఆంధుయంత్రము = ఏతాము
అగప = అబక
అగపడు = అగ్గము (= స్వాధీనముపడు)
అజస్రము = సర్వదా
అడవెట్టు - మొఱయిడు
అడువన్ = మొత్తఁగా
అతంత్రము = వికలము, భగ్నము
అతర్కము = ఊహింపమి, అరయమి
అదటు = గర్వము
అదవకాఁపు = అస్థిరపుఁగాఁపు
అనరు = ఇబ్బంది
అనిష్ఠుఁడు = వైరి
అనుగళత్ = మాటిమాటికి పడుచున్న
అనువు = సుంకము
అభిమారము = పైని (నూనె, నేయి) పోఁత
అరి = ధనరూపమైన పన్ను
అఱితి యొడిపి = గొంతుగండి
అలము = ఆక్రమించు
అవిద్య = 1. అగ్నిహోత్రాది కర్మ
            2. అజ్ఞానము
అహంమానము = అహంకారము
అహి = 1. పాము 2. తనవాఁడు
అగ్గలిక = ఉత్సాహము
అగ్గెడ = అక్కడ
అగ్నిశిఖ = కుంకుమపువ్వు
అద్ధా వాక్ = 'సరి' అనుమాట
అల్కు = భయము
అశ్మసారము = ఇనుము

ఆఁక = నిరోధము
ఆకర్షకము = సూదంటురాయి
ఆతతాయి = (తన్ను) చంపవచ్చినవాఁడు
ఆపాగా = తబేలా (= గుఱ్ఱముల నుంచుచోటు)
ఆమని = నుఱిపిడి (వసంతఋతువు)