పుట:ఆముక్తమాల్యద.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తూగింపు = నెఱవేర్చు
తూపరాణి = తూము
తెరవేఁట = తెరలతో ఆవరించిన చోటి వేఁట
తేట = 1. నీటితేలు
        2. ముత్తెపుఁగాంతి
తేరకత్తె = పనిలేనిది, అక్కఱలేనిది
తొగరు = ఎఱుపురంగు
తొడిబడి = తొట్రుపడి
తొలఁకు = అల
తోమాలె = ఆకులు పువ్వులు చేర్చి కట్టిన మాలె
తోయి = మేఘము
త్రస్తరి = క్రింద; పరిహాసము
త్రోపాడు = కైకొను

దంచనము = పెద్ద ఫిరంగి
దండ =భుజము
దండెత్తు = విజయార్థము సేనతో తరలు
దళితము = మఱువుదాల్చినది
దడములు = దట్టములు
దళ = కోఁత
దాత్ర = కొడవలియైనవాఁడా
దారపట్టు = దానముగొను
దీము = ఆకర్షకము
దును = దున్ను
దూపించు = దప్పిచే పీడనొందు
దౌ = దవ్వు
ద్రుహిణజ = నారద
ద్వయము = రెండువాక్యములు (వైష్ణవులయొక్క నారాయణరహస్యము)
ద్వైతము = జీవేశ్వరభేదము

ధర్మము = లక్షణము

నంబి = పూజారి (విష్ణుపూజకుఁడు)
నప్త = మనుమఁడు
నయము = సులువు
నల్లదాసరిగాఁడు = తాబేలు
నాకు = ఆనకు
నాగరము = సొంటి
నాగవాసము = వేశ్యలమేళము
నాటి = పాదుకొని
నిగ్రహస్థాన = పరాజయహేతువు
నిట్రు = శుష్కోపవాసము
నిమితికాడు = బోయవాడు
నిర్వాణము = మోక్షము
నిశారజస్సు = పసుపుపొడి
నీరాజనము = నివాళి
నీర్వట్టు = డప్పి
నెత్తము= 1. జూదము
            2. ఉమ్మడిబీడు
నెరవు = అగ్గము
నెఱసెన్ = వ్యాపించెను
నెఱి = 1. విధము 2. ఆచారము
నెఱిక = కుచ్చెళ్లు
నెఱికురులు = కుటిలకుంతలములు
నెఱియలు = చీలికలు
నెఱుఁగు = ఒరుఁగు

పంజరంబు = బురఖా, గవుసెన

పండించు = వంచించు పట్టము = తిరుప్పరివట్టము

పదరులు = గద్దింపులు