పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
లక్ష్యములు
గీ.

అనఘ! యానందరంగ లోకైకమిత్ర, యెలమి నీసూక్తి యమృతరసైక మయ్యె
నింద్రుని హసించునట్టి భోగైకపటిమ, నొనరు నినుఁ బొగడుదురు దివౌకు లెల్ల.

149
అథర్వణచ్ఛందమున
గీ.

హరియె పరమాత్ముఁడును ద్రిలోకైకనాథుఁ, డిందిరాదేవి సకలలోకైకజనని
యుష్ణకరసూనుఁ డయ్యె నక్షౌహణీశుఁ, డట్ల శల్యుఁడు నాథుఁ డక్షౌహిణులకు.

150
విష్ణుపురాణమున
క.

ఉర్వీశతిలక నాపే, రూర్వశి నొకపనికిఁగా దివౌకులమహిమల్
సర్వంబు విడిచి వచ్చితి, నుర్వర నొకకొంతకాల ముండెడుకొఱకున్.

151
భారతము, విరాటపర్వమున
ఉ.

ఆకమలాక్షిరూపమహిమాతిశయంబు మనోహరంబు భో
గైకపరాయణుల్ పురుషు లంగజుఁ డప్రతికారచేష్టిత
స్వీకృతలోకుఁ డట్లగుటఁ జేటు పురమ్మునవారి కెమ్మెయిన్
రా కెటులుండు నిట్టియపరాధపుఁబొత్తు మనంగ వచ్చునే?

152
భాస్కరరామాయణము, యుద్ధకాండమున
శా.

నీకంఠార్పితకాలపాశము శిరోనిర్ఘాతపాతంబు లం
కౌకస్సంచయకాళరాత్రి గళబద్ధోదగ్రకాలాహి క
న్యాకారాగతమృత్యు వౌజనకకన్యన్ వేగ యొప్పించి లో
కైకత్రాణుని రామునిం గనుము నీ కీబుద్ధి గాకుండినన్.

153
[1]విజయవిలాసమున
క.

......ర, సైకము నెమ్మొగము దీనిమృదుమధురోక్తుల్.

154


వ.

ఇట్లు అనేకప్రబంధాలలో ఉన్నది గనుక తెలియదగినది.

155

నఞ్ సమానయతి

ఉత్తమగండచ్ఛందంబున
క.

నసమాసనఞ్ సమాసము, లసమమ్ముగ నచ్చుహల్లులన్ యతితగుఁ దా
పసమానసశ్రితమానస, రసజలవిహరణవిలోల రాజమరాళా!

156
  1. వ్రాతప్రతులలో సుభద్రాపరిణయ మని ఉన్నది. విజయవిలాసమునకు అది రెండవపేరు.