పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
భాస్కర రామాయణము, యుద్ధకాండమున
గీ.

అన్న నీవు బుద్ధు లన్నకుఁ జెప్పుచు, నున్నమాట లెల్ల విన్న గోలెఁ
బొగులుచున్నదాన మొగ మొప్పకున్నది, యెత్తెఱంగొ చెప్పవే కుమార!

141
మనుచరిత్రమున
శా.

ఈపాండిత్యము నీకుఁ దక్క మఱి యెందేఁ గంటిమే కామశా
స్త్రోపాధ్యాయిని నా వచించెదవు...

142
శృంగారనైషధమున
ఉ.

హింసయ నీకు వేడ్క యగునేని కృపాశ్రయ మైనయీసరో
హంసముఁ జంపనేల కఱవా తరువాత వసుంధరాధిపో, త్తంస...

143
మఱియు, శృంగారనైషధమున
చ.

...హరిహయుఁ డేమియయ్యెనొ కదా మదనానలతాపవేదనన్.

144
భారతము, ఉద్యోగపర్వమున
క.

సభ నీకయి యేఁ బలికితి, నిభపురమున మాట పుట్టదే నీవు ననున్...

145
భాస్కరరామాయణమున
ఉ.

ఆరఘువీరుతోడఁ బగ యందుట యల్పమె తద్వధూటి మా
యారుచిఁ దెచ్చి నిల్పఁ దరమా యతఁ డస్త్రము నారిఁ గూర్చినన్
వారిధు లుండునో విపినవర్గము లుండునొ...

146

వృద్ధియతి

[1]కావ్యాలంకారచూడామణియందు (7.72)
క.

ఏకైకపదమ్మునకున్, నాకౌకశ్శబ్దమునకు నచ్చులు వడిగాఁ
గాకోకారంబులు నిఁక, గైకొనఁజను వృద్ధివళ్లు కవు లొడఁబడుటన్.

147
మఱిన్ని, నన్నయభట్లు లక్షణసారంబున
గీ.

కృతులలో శబ్దశాస్త్రజ్ఞమతముచేత, వృద్ధియెందును రూఢిగా నెసఁగియుండె
నట్టియెడఁ బ్రకృతివికృతుల ననుసరించి, యుభయమును జెల్లు వళ్లకు శుభచరిత్ర.

148


తా.

ఏకైక, నాకౌక, రసైక, అక్షోహిణీ మొదలయినశబ్దములయందలి అచ్చులకు హల్లులకు రెంటికీ యతి చెల్లుననుట.

  1. ఈ పద్యము వేదము వేంకటరాయశాస్త్రిగారు సంప్రతించిన కావ్యాలంకారచూడామణిప్రతిలో కొంచెము భిన్నముగా ఉన్నది.