పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తా.

అనుపమ, అనంత, అనేక, అనన్వయ, అనవద్య మొదలైన నఞ్ సమాసశబ్దములయందలియచ్చులకును యతి చెల్లుననుట.


గీ.

ఇలఁ గుటుంబప్రతిష్ఠ లనేకములు న, నంతగుణనిధి యైనయానందరంగఁ
డమరఁ గావించి కాంచె ననంతకీర్తి, నూత్నమా యెన్న నతనియనుపమమహిమ.

157
భారతము, ఆదిపర్వమున
ఉ.

ఆశ్రితపోషణంబున ననంతవిలాసమునన్ నీషివిమ
ద్యాశ్రమతత్వవిత్తమున...

158
భారతము, కర్ణపర్వమున
ఉ.

మ్రొగ్గెడు వాహనంబులును మోములు ద్రిప్పక పాఱుదంతులున్
నెగ్గితొలంగు సైనికు లనేకులు...

159


వ.

అని మఱిన్ని బహుప్రబంధములయందు చెప్పియున్నది గనుక జాడ తెలుసుకోగలది.

160

భిన్నయతి

.

అనంతచ్ఛందమున (1.123)
గీ.

అట ఇకారాంతపదముమీఁదటిదికార, మది యనంగ నవ్వలిభిన్నయతికిఁ జెల్లు
దివిజవిభవంబు శౌరిచేతిది యనంగ, నసురనాశంబు హరిచేతి యది యనంగ.

161
[1]మఱిన్ని, పెద్దరాజు అలంకారంబున
క.

అంచితతిలకము శౌరి ధ, రించె ననఁగ జగణమధ్యరేఫవిరతి యౌ
నంచితతిలకము హరి ధరి, యించె ననఁగ భిన్నవిరతి నిత్వము వచ్చున్.

162


తా.

ధరించె-ధరియించె, వరించె-వరియించె, భరించె - భరియించె, అను నీమొదలైనశబ్దములున్ను; చేతిది-చేతియది, వానిది-వానియది, ఊరిది-ఊరియది, ఆను నీమొదలయినశబ్దములున్ను మధ్యాక్షరవిరళములగును గనుక అచ్చుకు హల్లుకు యతి చెల్లుననుట.


క.

ఆనందరంగనృపతి య, హీనధరాభార[2]మున్ భరించుటచే ని
మ్మానవపతినిన్ సారెక, హీన ప్రముఖు లొనర న్నుతింతురు ప్రేమన్.

163
అధర్వణచ్ఛందమున
క.

...ముంచుకొనుఱాలజడికి భ, రించెద గోవర్ధనాద్రి యెలచేఁ గృష్ణా.

164
రాజశేఖరచరిత్రమున
ఉ.

చొచ్చినఁ బోకు పోకు మనుచు న్నృసకేసరి తేరు డిగ్గి నీ
వెచ్చటి కేఁగినన్ విడుతునే పటుబాణపరంపరాహతిన్

  1. ఇది అనంతచ్ఛందములో అనంతుఁడు చెప్పిన పద్యముగా ఉన్నది. (చూ1-122)
  2. ముద్ధరించు