పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తా.

చరణము మొదటీయక్షరమయినా విశ్రమస్థానాక్షరమైనా స్వరముండఁజెప్పి యందుకు విశ్రమాక్షరము హల్లువుంచితే అది కాకుస్వరయతిగాఁ జెప్పుట.

లక్ష్యము
క.

వసుమతి రసికాగ్రణి యై, యెసఁగిన నానందరంగఁడే ప్రోచు సుధీ
విసరముల నామహాత్ముని, యసమతరఖ్యాతి వింటిరా కవులారా!

124
భారతము, విరాటపర్వమున
ఉ.

చూచుచుఁ జేరి వ్రేల్మిడుచుచుం దలయూఁచుచు నిర్విదగ్ధయై
యాచపలాక్షి ముక్కుపయి నంగుళముం గదియించి దీనికై
కీచక యింతచేసితి సుఖిత్వముఁ బొందుదుగాక యింక న
ట్లేచిన నిట్లు కాకుడుగునే యనుచున్ వెఱఁగొందుచుండఁగన్.

125
భారతము, ఉద్యోగపర్వమున
క.

నీచెప్పెడి పెద్దలు ద్రో, ణాచార్యులు మొదలుగాఁగ ననికొల్లనివా
రై [1]చన్న వారలంగొని, యేచక్కంబెట్టువాఁడ నేఁ బాండవులన్.

126
మనుచరిత్రమున
ఉ.

అక్కట! గంధవాహ! తగవా హరిణాంకునిఁ గూడి పాంథులన్, బొక్కఁగఁజేయ...

127
భాస్కరరామాయణము, ఆరణ్యకాండమున
క.

ఓనారీమణి! యీమెక, మే నిప్పుడు తెచ్చియుంతునే నీమ్రోలన్
గానుకగా నని రాముఁడు, చే నమ్ములు విల్లుఁ దాలిచి యొకండె తమిన్.

128


వ.

అని యున్నది గనుక ఈజాడను అన్నీ తెలుసుకొనేది.

ప్లుతయతి

క.

దూరాహ్వానమునందు మ, హారోదన గాన సంశయార్థములతుదన్
[2]వారక జనియించిన ఫ్లుత, [3]మారయ వడి నిల్పఁ జెల్లు నచ్చులతోడన్.

129


వ.

అని భీమనచ్ఛందంబున నున్నది (చూ. సంజ్ఞ. 70) గనుక ప్లుతయతులు నాలుగు
విధాలు. అందు ప్రత్యక్షముగా మాట్లాడినట్లు చెప్పుట ఆహ్వానప్లుతము. శోకరస
యుక్తముగాఁ జెప్పుట రోదనప్లుతము. సంశయార్థముగా చెప్పుట సంశయప్లుత
ము. స్వరసంగతిని గానము చేసినట్లు చెప్పుట గానప్లుతము. గానప్లుతము మాత్రము
ప్ర్రబంధాదులయందు అపూర్వము గనుక దక్కినమూఁడుప్లుతములకు లక్ష్యములు.

  1. చేరనివారిం గొని
  2. జేరువఁదగ నాద్యచ్చుల; జేరువతో-జేరుపఁ దగునాద్యచ్చుల
  3. నారూఢిగఁ బ్లుతమువడి మహత్త్వము మీఱున్; తో రూఢిన్ బ్లుతమువడి యెదుర్కొని నిలుచున్