పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఈరెండు నొకటొకటికి యతి చెల్లును. ఇది స్వరము లైనఅచ్చులకున్ను వ్యంజన
ము లైనహల్లులకున్ను కూడా నిర్ణయము గనుక తెలియగలది.

115


గీ.

అమితధీరత్వమునఁ గనకాద్రిఁ గేరి, యుజ్జ్వలాకృతి మాధవు నోహటించి
యెన్నఁదగువిక్రమమున మృగేంద్రుఁ దెగడి, ప్రబలి తౌరౌర యానందరంగధీర!

116
మఱిన్ని, పెద్దిరాజు నలంకారంబున (7-33)
గీ.

అవని ధర్మజుఁ బోలు నిత్యార్యచర్య, నాదిరాజులఁ దొరయు నిత్యైంద్రభూతి
నరుల నిర్జించు [1]భుజశక్తి నతిశయిల్లి, విధుకులాగ్రణి చాళుక్యవిశ్వవిభుఁడు.

117


వ.

అని వున్నది గనుక ఈజాడను అన్నిటికీ తెలుసుకొనేది.

118

గూఢస్వరయతి

అథర్వణచ్ఛందంబున
గీ.

అరయ నన్యోన్యశబ్దపరోక్షములకు, న్యోరువర్ణంబు లగు నుర్వి నుతచరిత్ర
వినుము గూఢస్వరములగు వీనియందు, నచ్చులకు హల్లులకు యతు లమరు నండ్రు.

119


తా.

అన్యోన్య పరోక్ష దాసో౽హ శబ్దములయందు గూఢస్వరము లుండుటచేత నవి యచ్చులకు హల్లులకు యతులు చెల్లును.

లక్ష్యము
గీ.

ఒనర వైభవవిజితబిడౌజ నీకు, నహితనికరంబు మ్రొక్కు దాసో౽హ మనుచు
నమరఁ గవిరాజవినుత యశో౽బ్ధివగుట, నవ్యకవితాప్రసంగ యానందరంగ.

120
మఱియును, నన్నయ లక్షణసారంబున
గీ.

స్వరముతుద నుండు లుప్తవిసర్గ కోత్వ, మైన గూఢస్వరయతి దాసో౽హ మనఁగ
నచ్యుతాశ్రితు లుర్వి నన్యోన్యమిత్రు, లనఁగ నమ్మాధవుండు యశో౽బ్ధి యనఁగ.

121


వ.

అని వున్నది గనుక తక్కిన అన్నింటికిని తెలియగలది.

122

కాకుస్వరయతి

[2]అథర్వణచ్ఛందంబున
క.

కాకుస్వరయతి దగు నితఁ, డే కదలక జలధిఁ బవ్వళించె ననఁగ [3]బు
ణ్యాకలిత దీర్ఘముగ నితఁ, డే కవ్వడి రథము గడపె నిమ్ముల ననఁగన్.

123
  1. బాహుదండాగ్ర్యమునను
  2. ఈపద్యము అనంతచ్ఛందములో అనంతుఁడే చెప్పినట్లున్నది (1.95). అప్పకవీయములో అనంతచ్ఛందమునందు అని ఉన్నది (8-94).
  3. ప్ర,శ్నాకలిత (అనంతచ్ఛందములోను, అప్పకవీయములోను ఉన్నది.)