పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బవిరళవకార మగు న, య్య [1]పదాఱవపే రెఱుంగు ననఁగ ముకుందా.

75
అథర్వణచ్ఛందంబున
గీ.

అరయఁ గన్గవ చన్గవ యనెడి రెండు, నుడులపొల్లులు బిందుతను గని ప్రాస
సంగతిని సంధిగత మగుఁ గంగవ యన, చంగవ యన బిందుయతి యెసంగనెందు.

76
కవిలోకసంజీవనియందు
క.

[2]ప్రథమాంతవిభక్తులపై, కథితము లగుకచటతపలు గసడదవ లగున్
పృథివి నవి గజడదబ లగు, ప్రథమపుసున్న లగు నాంతపదములమీఁదన్.

77


తా.

ప్రథమాంతవిభక్తిగావుండే తెనుఁగుశబ్దముమీద కచటతప ఈ 5 అక్షరములు ఆదినుండే శబ్దములు నిలిచినట్టయితే కకారము గకారమగును. చకారము సకారమగును. టకారము డకారమగును. తకారము దకారమగును. పకారము వకారమగును. మఱియొకప్పు డాచకారము జకారమగును. పకారము బకారమగును. ఈగజడదబలు వలపలిగిలక కలిగినయక్షరములతోఁ జేరివుంటే ఆవలపలిగిలకలు సున్న లగును.

ఇందుకు లక్ష్యము
గీ.

అవని భవదీయకీర్తిలక్ష్మి పరమేశు, నిం గదిసి మించి యతనితురంగ మతని
మంజునిలయ౦బుఁ గేరి వెసం జెలంగె, నౌర యానందరంగరాయాగ్రగణ్య!

78
మఱిన్ని, భారతము, ఉద్యోగ పర్వమున
క.

కావలియై సురరాజ్య, శ్రీ వాలింపం దగున్.........

79
వసుచరిత్రమున
మ.

వివిధోర్వీపతులన్ జగన్నుతుల మున్ వీక్షింపమో వారిపెం
పు పరీక్షింపమొ నింపమో చెలిమి యేభూపాలునందైన నీ
భువనత్రాణపరాయణు...

80
భారతము, విరాటపర్వమున
శా.

సింగం బాఁకటితో గుహాంతరమునన్ జేట్పాటుమై నుండి మా
తంగస్ఫూర్జితయూధదర్శనసముద్యత్క్రోధ మై వచ్చునో
జం గాంతారనివాసఖిన్నమతి నస్మత్సేనపై వీఁడె వ
చ్చెం గుంతీసుతమధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్.

81
  1. నదాఱవపాలె
  2. ఈపద్యము అనంతచ్ఛందములో గ్రంథకర్త పద్యమువలె ఉన్నది. (చూ. 1–61)