పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
భారతము, భీష్మపర్వమున
శా.

గంగానందనుఁ గూల్చి ద్రోణుపని చక్కం జేసి [1]ఘోరారి శౌ
ర్యాంగారంబుల నొక్కపెట్టఁ గొని బాహాటోప మేపారని
త్తుం గౌంతేయుల కిమ్మహీవలయమున్...

82
భారతము, కర్ణపర్వమున
క.

సంజయ మురభంజనుని ధ, నంజయునిం జీరికింగొనఁడు కర్ణుం డిం
ద్రుం జెనకి యైన గెలుతు న, నుం జచ్చెనె యట్టివాఁడునుం గయ్యమునన్.

83


వ.

అని మహాకవులప్రయోగము లున్నవి గనుక జాడ తెలుసుకొనేది.

84

ప్రాస మైత్రి

[2]అనంతచ్ఛందమున
గీ.

లళలు రెండును నొండొంటిఁ గలసి వచ్చు, నమరు నన్యోన్యముగ ఋయుతాయుతములు
బిందుపూర్వమై తమలోనఁ బొందు బమలు, ప్రాసమైత్రికి నిది స్వరూపంబు గృతుల.

85
మఱిన్ని, గోకర్ణచ్ఛందమున
గీ.

తగ ఋకారాన్వితంబు ద్విత్వంబు గాఁగఁ
బరఁగు నచ్చపుజడ్డతోఁ బ్రాసమైత్రి
యక్కృపానిధి హరిఁ గని మ్రొక్కె ననఁగ
సంభృతాశ్రితుఁ డతియశోజ్జృంభి యనఁగ.

86


తా.

లకారరకారములు ప్రాసములున్నా వట్రువసుడి లేనియక్షరము ప్రాసమున్నా నున్నలుగలిగినబకారము మకారము ప్ర్రాసములున్నా అది ప్రాసమైత్రి.

అనంతునిచ్ఛందమున (1-41)
గీ.

లాలితానందరంగరాణ్మౌళి చాల, నెమ్మితో రాయసింహాసనంబు నెక్కి
సకలరాజన్యపూజితసుకృతి యగుచు, శాశ్వతఖ్యాతిఁ జెందు నీవిశ్వమునను.

87


గీ.

నీలవర్ణగర్భగోళంబునందు లో, కంబులెల్ల నుండు నెమ్మితోడ
శ్రీకి వొడయఁ డుజ్జ్వలాకృతి యితఁ డన్న, [3]బ్రాసమైత్రి యెసఁగు వాసుదేవ!

88
భారతము, ఆనుశాసనికపర్వమున

.

క.

భాతృస్నేహము గలిగి య, రాతులు భయమందఁగా ధరారాజ్యము సం
ప్రీతి ననుభవించిరి జను, లాతతహర్షమునఁ బొంది రందఱు నెమ్మిన్.

89
  1. కౌరవ్యవీ
    రాంగమ్ముల్ నుఱుమాడి తత్ప్రబలసైన్యంబెల్ల మాయించి యి
    త్తుం
  2. వ్రాతప్రతులలో ఇది ఉత్తమగండచ్ఛందములోని దని ఉన్నది.
  3. బ్రాసమైత్రి యిట్లు పరఁగుఁ గృష్ణ.