పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పాదితసర్పయాగమున భస్మము సేయుము తక్షకాదికా
కోదరసంహతిన్ హుతవహోగ్రసమగ్రశిఖాచయమ్ములన్.

67


అని యున్నది గాన జాడ తెలియునది.

త్రివర్ణప్రాసము

శ్రీధరచ్చందంబున
గీ.

కృతులఁ ద్రత్వత్రయమును దత్వ మొకటి, యటులు గాక తవర్ణత్రయముఁ ద్రకార
మొకటి ప్రాసంబులుగ నిల్ప సుకవిచంద్రు, లవనిలోఁ ద్రివర్ణప్రాస మండ్రు శౌరి.

68
ఇంకను అనంతచ్ఛందంబున (1,45)
గీ.

[1]సంధిఁబల్కు త్రికారంబు చనుఁ దకార, సదృశ మైత్రికారప్రాససంజ్ఞఁ గలిగి
ఆత్రివిక్రముఁ డభయప్రదాత యనఁగ, వాక్త్రిపథగోజ్జ్వలులు విష్ణుభక్తు లనఁగ.

69


తా.

త్రకారములుగావుండే అక్షరములు మూఁటికిన్ని ఒక్కతకారమైనా, తకారములు మూఁటికిన్ని ఒక్కత్రకారమైనా ప్రాసములుగా వుంచి చెప్పవచ్చును.


క.

దాతలదాత యనంగా, రీతిగ నానందరంగనృపమణి గనె వి
ఖ్యాతి నెరయోధ యతఁ డే, యీత్రిభువనమునను గలుగునృపతులలోనన్.

70
మఱిన్ని, నంది సింగన బలరామవిజయమున
క.

క్షత్రియధర్మంబున మాం, ధాతృఁడు రాజ్యంబు నీతిఁ దగఁ బాలించెన్
శాత్రవరహితంబుగ నిజ, గోత్రము వెలయంగఁ బ్రజలు గొనియాడంగన్.

71
నాచనసోముని హరివంశమున
[2]శా.

నాతో మార్కొనలేరు నిర్జరమరున్నాగేంద్రబృందారకా
రాతు ల్మున్నుగ దేవసంఘములె పోరన్ లేవు సాంగ్రామికుం
డీత్రైలోక్యమునందుఁ గానము రణం బెచ్చోట లేకుండఁగాఁ
జేతు ల్వేయు వృధాభర మ్మగుచుఁ దోఁచెం దేవ యిమ్మేనికిన్.

72
అల్లసాని పెద్దన హరికథాసారమున
సీ.

ఆత్రినేత్రుఁడు వనజాతదళాక్షుని, గూరిచి తపముఁ గైకొనినచోటు...

73


వ.

అని యీరీతి ఆయాప్రబంధములం దున్నది గనుక దెలియఁ గలదు.

74

సంధిగతప్రాసము

అనంతచ్ఛందంబున (1.59)
క.

ధృవముగ సంధిజనితరూ, పవిశేషప్రాస మగుచుఁ బరగుఁ బకారం

  1. సంఖ్యఁ
  2. ఈ పద్యము హరివంశమునఁ గానరాదు గాని అప్పకవీయములో కూడా ఉదాహృతము. (చూ. 3-320)