పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
బృందాసంభవము, [1]పరాంతం అప్పన్న
క.

పో నుద్యోగము చేసిన, ప్ర్రాణంబా యిదియె నీకుఁ బాథేయం బా
మానిని మందస్మితమధు, రానన చంద్రికలఁ గ్రోలి యరుగుము పిదపన్.

37
వరాహపురాణమున
క.

శ్రీ నారాయణ నిన్నున్, బ్రాణముగాఁ జూచుకొని...

38


అని వున్నది గనుక తెలియవ్రాసినాను.

బిందుప్రాసము

గీ.

రహిని బ్రాసాక్షరాదివర్ణంబు గిలుక, నమరియుండిన నది బిందు వగుచు బిందు
వర్ణములఁ జేరి ప్రాసమై వన్నె కెక్కు, సుందరీమోహనాంగ యానందరంగ!

39


తా.

మూఁడుచరణముల ప్రాసాక్షరములకు మొదటియక్షరములకు సున్నలుండి ఒక యక్షరానకు వలపలిగిలక వుంటే అదిన్ని సున్నగలయక్షరమై ప్రాసము చెల్లును.

లక్ష్యము, అనంతచ్ఛందమున (1. 51)
గీ.

పేర్చి పొల్లునకారంబు [2]బిందు వగుచు
[3]మీఁది సున్న ధకారంబు నూఁదఁ బ్రాస
బంధ మగుఁ గృష్ణుఁ డుదయించినన్ ధరిత్రి
యంతయును నిరుపద్రవం బయ్యె ననఁగ.

40
మఱిన్ని, సారంగధరచరిత్రమున
క.

కన్ దోయి చల్ల గా నిటు, కందోయి నృపాలు లెస్సగా నింకొకమా
ఱందఱిముందఱ నీవని, చిందఱవందఱయు గుట్టు చిట్టాడంగన్.

41
హరికథాసారము, చతుర్థాశ్వాసము, అల్లసాని పెద్దన
క.

అంబరము వగుల నార్చి ప్ర, లంబాసురుఁ డాగ్రహము వెలయఁ గదిరిన వే
ళం బలరాముఁడు చేముస, లంబున వానితలఁ ద్రుంచె లావు మెఱయఁగన్.

42
భారతము, ఆరణ్యపర్వమున
మత్త.

అమ్మునీంద్రునివాసశక్తిఁ దదంగరాజ్యములందు మే
ఘమ్ము లెల్ల కెలంకులం గడుఁ గ్రమ్మి సర్వజనప్రమో

  1. బృందాననసారంబున (ఈపద్యము అప్పకవీయములో మధుసేవనమునందు అని ఇచ్చి ఉన్నది)
  2. బిందువగుట
  3. మీఁద నున్నధకారంబు నూఁదఁ బ్రాస