పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అనంతచ్ఛందంబున (1-73)
క.

వారణవరద నిశాటవి, దారణ వీరావతార ధరణీవలయో
ద్ధారణ వరమునినుత యని, ధోరణిగాఁ జెప్ప నది చతుష్ప్రాప మగున్.

31


తా.

ఈయాఱువిధము లగుప్రాసములు నిండావాడుక అయినందుచేత లక్ష్యాలు ప్రబంధాదులనుండేవి యెత్తివ్రాయలేదు. తక్కిన ప్రాసములకు వ్రాయవలెను గనుక వ్రాస్తున్నాను.

ఋకారప్రాసము

క.

అరయ రేఫలు మూఁడు ఋ, కార మొకటి ప్రాసముగను గదియించినచో
మీఱు ఋకారప్రాసము, పేరున నానందరంగ పృథ్వీరమణా!

32


తా.

స్వరములలో ఉండే ఋకారము 1, రేఫలు 3 గాని, ఋకారములు 3, రేఫ 1 గాని కూర్చి నాలుగు చరణములకు ప్ర్రాసములుగా వుంచుకొని పద్యము చెప్పవచ్చును.

లక్ష్యము, అథర్వణచ్ఛందంబున
క.

అరయ స్వరగణ మయ్యు ఋ, కారము ఋప్ర్రాస మగుచుఁ గదియును రేఫన్
జేరి తనయురముఁ దన్నిన్నయాఋషి పాదములు పిసికె నచ్యుతుఁ డనఁగన్.

33
భారతము, అరణ్యపర్వమున
క.

ఆఋషికొమరుఁడు గట్టిన, చీరలు మృదులములు నవ్యచిత్రములు మనో
[1]హారులు నాతనిపృథుకటి, భారమ్మున నొక్కకనకపట్టము మెరసెన్.

34

ప్రాది ప్రాసము

గీ.

ప్రాది యైననకారశబ్దములు మూఁటి, కొకనకారంబు రేఫసంయుక్త మగు న
కార మొక్కటి మూఁడుణకారములకుఁ, బ్రాసములు చెల్లు నానందరంగధీర!

35


తా.

ప్ర అనే ఉపసర్గయాదిగా గలనకారశబ్దము "ప్రాణ” అనుశబ్ద మయ్యెను గనుక ఆశబ్దములు మూఁటికి ఒక నకార ప్ర్రాసము చెల్లును. నకారములు మూఁటికి రేఫతో చేరిన ణకార మొకటి చెల్లును.

అనంతచ్ఛందంబున (1-48)
గీ.

ప్రాది యై[2]ననకారంబు ప్ర్రాణమగుట, పరగ నణలకు [3]నొండొంటఁ బ్రాసమైత్రి
క్షోణిధరుఁ డెత్తె నేనుఁగుప్రాణమనఁగ, దానవారాతివ్రేఁతలప్ర్రాణ మనఁగ.

36
  1. హారము లాతని; హారితము లతని
  2. యనశబ్దంబు
  3. వేర్వేఱఁ బ్రాసమయ్యె