పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఇఁకను యతులకు ఆదిమకవి భీమనచ్ఛందమున (సంజ్ఞ 62)
క.

స్వరవర్గాఖండప్ర్రా, ద్యురుబిందుప్లుతములును బ్రయుక్తాక్షరముల్
పరువడి నెక్కటి పోలిక, [1]సరస లనన్ బదివిధములఁ జను వళ్లు మహిన్.

9


అని పది యతులున్ను,

పెద్దిరాజు అలంకారంబున
గీ.

యతులు స్వరవర్గసరసగుణితవిభాగ
బిందుకాకుస్వరాఖండ భిన్ వృద్ధి
దేళ్యములు ప్రాదియెక్కటాదేశములును
పోల్కి గూఢస్వర మన నొప్పును బదాఱు.

10


అని పదాఱుయతులున్ను జెప్పి ఉన్నది. మఱిన్ని,

అథర్వణచ్ఛందంబున
సీ.

స్వరయతుల్ ప్లుతయతుల్ సంయుక్తయతులును వర్గయతులు బిందువడి యఖండ
విరతి పోల్కి వడి యభేదయతి సరసయతి చక్క టెక్కటియతులు మఱియుఁ
బ్రభునామయతియును బ్రాదులు వృద్ధులు మయతియు నిత్యసమాసయతియు
నాదేశయతులు రియతి ఋయతి వికల్పయతులు విభాగపుయతులు దేశ్య


తే.

యతులు భిన్నయతులును గుణితయతులును
ప్రాదినిత్యసమాసవిరహితయతులు
ఘజ్ యతులు శకంధుయతులు నఞ్ యతు లవ
ల నసమాసయతు లిరువదెనిమిదొకటి.

11


అని యతులు 29 విధములుగాఁ జెప్పి ఉన్నది. మఱిన్ని,

కవిరాక్షసచ్చందంబున
శా.

శ్రీదైతాయతు లిర్వదొక్కటియగున్ ఋప్రాదినిత్యజ్ఞ కా
క్వాదేశంబులు వృద్ధిఘఞ్ సరసనామాఖండవర్గప్లుత
భాగమల్ స్వరజముల్ మాసుస్వరంబుల్ విక
ప్రాదుల్ చక్కటిపోల్కి యెక్కటియుఁ గావ్యాళిన్ బ్రసిద్ధంబగున్.

12


అని 21 విధములుగా చెప్పివున్నది. మఱియు,

నన్నయభట్టు లక్షణసారంబున
మ.

స్వరవర్గప్లుతముల్ శకంధుగణఋత్వప్రాద్యభేదోర్వను
స్వరభిన్నప్రభుకాకునిత్యములు దేశ్యజ్ఞోభయాఖండముల్

  1. సరసలు నాఁ బదియు వళ్లు చను నిద్ధాత్రిన్.