అక్షరములకు నామనక్షత్రములఁ దెచ్చు వివరము.
| చూచేచోలా అశ్విని ఇత్యాదులు. | |
వ. | ఈనాలు గక్షరములు నక్షత్రములకు నాలుగు పాదములుగాఁ దెలియఁగలది. | 198 |
షష్ఠాష్టకములు
గీ. | మెఱయుమీనతులలు మిథునవృశ్చికములు, వృషభధనులు మకరమృగవరములు | 199 |
తా. | మీనతులలకు, మిథునవృశ్చికములకు, వృషభధనుస్సులకు, మకరసింహములకు, కుంభకటకములకు, కన్యామేషములకును, షష్ఠాష్టకములు. కావునఁ బద్యాద్యక్షరరాశికిని, ప్రభువు నక్షత్రరాశికిని ఇవి పరిహరించి చెప్పవలెను. | |
గీ. | మీను తూని కోల మిథునంబుఁ దేలును, ఎద్దు విల్లు మొసలి పెద్దమెకము | 200 |
సత్త్వరజస్తమోవేళానిర్ణయము
గీ. | చంద్రగురుదినముల సత్త్వంబు కుజశుక్ర, దివసములను రజము రవి బుధార్కి | 201 |
తా. | సోమగురువారముల నుదయాది సత్త్వవేళ. అంగారకశుక్రవారముల నుదయాది రాజసవేళ. రవిబుధశనివారముల నుదయాది తామసవేళ. శనివారము తప్ప తక్కినవారములయందు లగ్న మొకటికి మూడుమ్ముప్పాతిక గడియ. శనివారమునాఁడు లగ్న మొకటికి నాలుగు గడియలు. | |
| “సత్త్వవేళాచంద్రగురూ రాజసా కుజభార్గవౌ, | 202 |
గీ. | శశిగురుదినోదయంబుల సత్త్వ మొదవుఁ, గుజకవిదినోదయంబుల రజము పరగుఁ | 203 |
వ. | ఇంక నీమూఁడువేళలలో సాహిత్యము చెప్పుటకు నిర్ణయము. | 204 |
గీ. | ఝషధనుస్త్రీకటకములు సత్త్వవేళ, అజకులావృశ్చికవృషముల్ రజమువేళ | 205 |