దగ్ధజ్వలితధూమితనక్షత్రములు
| "క్రూరోన్ముక్తం దగ్ధంక్రూరయుతం జ్వలితధూమితం పురతః, | 190 |
క. | ఇనశనికుజరాహువు లొ, య్యన విడిచినయవియు నిలిచినవి యెదిరినవిన్ | 191 |
తా. | సూర్యుడు, శని, అంగారకుఁడు, రాహువు యీ నలుగురు క్రూరగ్రహములు గనుక నాగ్రహము లనుభవించి విడిచిన నక్షత్రములు దగ్ధము లనియు, వాసముచేయు నక్షత్రములు జ్వలితములనియు, బ్రవేశింపఁబోవు నక్షత్రములు ధూమితము లనియుఁ జెప్పఁబడును. కావునఁ బద్యాదిగణముయొక్కనక్షత్రము, ప్రబంధమారంభించిననాఁటి నక్షత్రము, ప్రభువునక్షత్రము నీమూఁడును పైనుదాహరింపఁబడిన మూఁడుతెగలలో చొఱకయుండవలెను. | |
క. | క్రూరగ్రహభుక్తము లగు, తారలు దగ్ధములు; ధూమితంబులు వానిన్ | 192 |
గీ. | ధనముఁ గోలుపుచ్చు దగ్ధనక్షత్రంబు, చాలఁగీడుఁ దెచ్చు జ్వలితతార | 193 |
| "ఏనం గజానాం నక్షత్రం కర్తు ర్జన్మర్క్షకం తథా, | 194 |
| అనుకూల్యం సముద్ద్వీక్ష్య శ్లోకాదా రచయే ద్భుధః, | 195 |
గీ. | గణముతారయుఁ బతితారకమును రెండు, క్షేమసిద్ధికి వ్యాధినిర్జీవగతుల | 196 |
క. | పతితారకుఁ బద్యముఖ, స్థితతారకమునకుఁ జెలిమి తెలియక జడుఁడై | 197 |