| “న్యస్తాః కావ్యముఖే వర్ణా సత్తదైవతమూర్తయః, | 130 |
భూసురాది చతుర్జాతులవర్ణములు
క. | ధవళారుణపీతశ్యా, మనసనభూషలు పయోవిమలఘృతమధ్వా | 131 |
తా. | బ్రాహ్మణజాత్యక్షరములకుఁ దెల్లనివస్త్రభూషణములు, నుపహారము పాలు. క్షత్రియజాత్యక్షరములకు నెఱ్ఱనివస్త్రభూషణములు నుపహారము నేయి. వైశ్యజాత్యక్షరములకుఁ బచ్చనివస్త్రభూషణములును నుపహారము తేనె. శూద్రజాత్యక్షరములకు నల్లనివస్త్రభూషణములు నుపహారము మద్యము. కాన నేజాతియక్షరము లాదిని బ్రయోగించుచున్నారో, యాజాతియక్షరములకుఁ దగినవస్త్రభూషణనైవేద్యముల నర్పించి మాతృకాపూజ చేసి ప్రబంధము మెరవడిచేయవలయును గనుకఁ గవు లైనవార లీరీతిని నడిపించునది. | |
సీ. | కాదిత్రివర్గవర్ణాదికి మౌక్తిక, వజ్రభూషలు తెల్పు వస్త్రచయము | |
తే. | వరుస నీనాల్గుతెఱఁగులవర్ణములకు, ననుభవం బగు ద్రవ్యంబు నానవా(బా)లు | 132 |
క. | ఇత్వము నేత్వ మధోముఖ, మైత్వం బిల నూర్ధ్వముఖము నౌత్వము నుత్వం | 133 |
గీ. | ఇత్వ మేత్వములును నిల నధోముఖములు, నైత్వ మూర్ధ్వముఖము నొత్వములును | 134 |
గీ. | మీఁదిముఖము లైన మిడియించుఁ బతి నేఁట, బార్శ్వముఖము లైనఁ బాయు లక్ష్మి | 135 |