| ఖాండవోచ్యానంబుఁ గాన నేరక సిగ్గు, పడి చన్ననిర్జరప్రభునికంటెఁ గ్రీడాకిరాతుఁడై క్రోడంబునకుఁ గాను, బెనఁగి చిక్కినత్రిలోచనునికంటె. | 54 |
వ. | అని యున్నది గనుకఁ తెలియునది. | 55 |
గీ. | ప్రథమలు విశేషణములుగాఁ బలుకవచ్చు | 56 |
తా. | షష్ఠీవిభక్తికి విశేషణములైనశబ్దములు ప్రథమావిభక్తులుగఁ గూడఁ జెప్పవచ్చును. | |
క. | అపరాహ్ణసమయమున ని, ట్లుపమాతీతాతిఘోరయుద్ధం బయ్యెన్ | 57 |
వ. | అని యున్నది గాన జాడ తెలియునది. | 58 |
గీ. | వెలయ మూర్ఖధూర్తవృద్ధనచపదాళి, కొనరు డుత్వమైన నుక్వమైన | 59 |
తా. | ధూర్తు, ధూర్తుఁడు; మూర్ఖు, మూర్ఖుఁడు; నీచు, నీచుఁడు; వృద్ధు, వృద్ధుఁడు; అని యీ నాలుగుశబ్దములు రెండువిధములుగఁ బ్రయోగింపవచ్చును. | |
ఉ. | చొచ్చినచోన చొచ్చి తెగఁజూచెద నంచుఁ గడంగుఁ గాని నన్ | 60 |
క. | అలయికయుఁ దలవడఁకు వె, క్కలు జనియించుటయు నురలు గలుగుటయును వృ | 61 |
వ. | అని యున్నది గనుక జాడ తెలియనది. | 62 |
గీ. | పరఁగ దిర్యక్కు లిల శ్రేష్ఠపదము లైనఁ, బురుషవాచకములుగాను బూన్పవచ్చు | 63 |
తా. | తిర్యక్పదము లైనశబ్దములు శ్రేష్ఠవాచకము లైనపుడు పన్నగేంద్రము, పన్నగేంద్రుఁడు; మృగరాజము, మృగరాజు; పరిగశ్రేష్ఠము, పరిగశ్రేష్ఠుఁడు; | |