గీ. | భువిఁ దకారాంతశబ్దముల్ పురుషపరము, లైన నూఁదుచుఁ దేలుచు నలరుఁ గృతుల | 46 |
తా. | కైటభజిత్తు, యుధాజిత్తు, పరీక్షిత్తు, ఇంద్రజిత్తు, సత్రాజత్తు యివి మొదలగుపురుషవాచ్యశబ్దములు తెనుఁగున నొక్కొక్కదిక్కునఁ దేలికగాఁ గైటభజితు, ఇంద్రజితు, సత్రాజితు, యుధాజితు అనియుఁ జెప్పవచ్చును. | |
చ. | అనవరతాన్నదానయజనాభిరతున్ భరతాన్వవాయవ | 47 |
వ. | అని యున్నది గనుక జాడ తెలియునది. | 48 |
గీ. | కలిగి యనుచోట నై యని పలుకవచ్చు, నండ్రు శ్రీమద్వజారతానందరంగ | 49 |
తా. | ‘కలిగి’ యనుశబ్దము నిలుపఁదగినచోట 'ఐ' యనుశబ్దము నుంచినయెడల నాయర్థమునే యిచ్చును. | |
క. | అరుణాశ్వంబులఁ బూన్చిన, యరదంబున వీఁడె నిడుద లగుచేతులు బం | 50 |
సీ. | తెల్లనిగొడుగు నై తేజరిల్లుచు నున్న యల్లవాఁడే పాండెవాగ్రజుండు... | 51 |
సీ. | అర్థి విశ్వావసుఁ డాదిగా గలుగుగంధర్వులు హృద్యవాదన మొనర్ప | 52 |
| అని యున్నది. | |
గీ. | పంచమివిభక్తిని నికారవర్ణ మొకటి, లోపముగఁ జెప్పవచ్చు ముల్లోకములను | 53 |
తా. | కృష్ణుకంటె, కృష్ణునికంటె; రాముకంటె, రామునికంటె; అని పంచమీవిభక్తి రెండువిధములఁ జెప్పవచ్చును. | |
సీ. | రాత్రిమైఁ దాఁకి క్రూరతఁ బోరి మగఁటిమి వాసినయంగారపర్ణుకంటె | |