పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

బృందాలు దాదాపు 15 యాత్రలు నిర్వహించాయి క్రీ. శ 1600 నాటికి ఇంగ్లీషు ఈస్టిండియా కంపెనీ ఏర్పాటు కావడంతో డచ్చి నెదర్లాండు పాలకులు కూడ వివిధ బృందాలుగ వున్న వ్యాపారస్థులందర్ని కలిపి ఒకే వర్తక సంఘాన్ని ఏర్పాటు చేయ దల్చారు. తూర్పు దేశాలపై తమకున్న వ్యాపార పరమైన ఆది పత్యాన్ని నిలుపుకోవాలని ప్రయత్నించారు. ఈ ప్రయత్నంవల్లే క్రీ శ 1602లో నెదర్లాండ్‌ యునైటెడ్‌ ఈస్టిండియా కంపెనీ అనే వ్యాపారసంస్థప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పడింది

సుగంధ ద్రవ్యాల వ్యాపారాన్ని తమ గుత్తాదిపత్యం క్రిందికి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో డచ్చివారు మొదట భారత దేశంపై కంటె తూర్పు దీవులపైన్నే తమ దృష్టిని కేంద్రీకరించారు. డచ్చి ఈస్టిండియా కంపెనీ మొదట విల్‌ బ్రాండ్‌ వాన్‌ వార్విజిక్‌ నాయకత్వంలో 15 వ్యాపార నౌకల్ని పంపింది తూర్పు దీవుల్లోని జావా, సెలిబస్‌ మొదలగు ప్రాంతాల్లో ఫ్యాక్టరీల్ని స్థాపించింది ఇండియాలో సూరత్‌, మచిలీపట్నం, పేటపోలి (కృష్ణా జిల్లా) ప్రాంతాల్లో డచ్చి ఫ్యాక్టరీలు వెలశాయి నాగపట్నం, నరసాపురం, బీముని పట్నం, చిన్సురా (బెంగాలు) మొదలగుచోట్ల కూడ డచ్చివారు ఫ్యాక్టరీలు స్థాపించారు.

ఆంగ్లేయుల రాక

ఇంగ్లాండు దేశం కూడ ఇతర యూరపు దేశాల వలెనే సుగంధ ద్రవ్యాల్లాంటి తూర్పు దేశపు వస్తువుల్ని ఇటలీ వ్యాపార నౌకల ద్వారా తమ నౌకా కేంద్రాలకు తెచ్చుకునేవారు. తాము వుత్పత్తి చేస్తున్న ఉన్ని దుస్తుల్ని ఆసియాదేశాల్లో విక్రయించి, ఆసియాలో వ్యాపార సంబంధాల్ని వృద్ది చేసుకునేందుకు ఇంగ్రండు కూడ మక్కువ చూపింది కాని క్రీ శ 17వ శతాబ్ది వరకు వివిధ కారణాలవల్ల తూర్పు దేశాలతో వ్యాపారాల్ని ఇంగ్లాండు చేపట్టలేక పోయింది సుదూర సముద్రయానానికి తగిన నౌకా సంపత్తి లేకపోవడం, అట్లాంటిక్‌ సముద్రం భౌగోళికంగా ఇంగ్లాండు దేశాన్ని మధ్యధరా సముద్రంలో సాగే యూరపు వ్యాపారానికి దూరంగా వుంచడం ఈ వెనుక బాటు తనానికి ముఖ్య కారణాలుగ చెప్పవచ్చు. కాని 16వ శతాబ్దాంతానికి ఇంగ్లాండు తనకు కల్గిన అవరోధాల్ని అధిగమించ కల్గింది తన నౌకాయాన సామర్థ్యాన్ని పటిష్టం చేసుకో కల్గింది హిందు మహాసముద్రం,