పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

35

అట్లాంటిక్‌ సముద్రాల్లో ప్రవేశం అవరోధ రహితం కావడంతో సముద్రాంతర మార్గాల విషయంలో తన భౌగోళిక స్థితిని వుపయోగించుకోడానికి సకల విధాల ప్రయత్నించింది

స్పెయిన్‌ దేశంతో విరోధం వల్ల తద్విరుద్దమైన విదేశీ విధానాన్ని పాటించేందుకు ఇంగ్లాండు వలసరాజ్యస్థాపకు, వ్యాపారాన్ని విస్తృతం చేసేందుకు ప్రయత్నించింది క్రీ శ 1574లో ఇంగ్లీషు నావికుడైన ఫ్రాన్సిస్‌ డ్రేక్‌ మొలుక్కస్‌లోని టెర్నేట్‌ను సందర్శించాడు ఇతడు తన ప్రయాణంలో ఉపయోగించిన అతివేగంగా నడిచే తేలిక పాటి నౌకలు సముద్రయానానికి అనువైనవని తేలడంతో ఇంగ్లాండుకు ఆత్మస్థైర్యం కల్గింది దీనికి తోడు లండను వర్తకులు తూర్పు దేశాలతో వ్యాపారానికి తమ సంస్దిధతసు వ్యక్త పరిచారు. కాని గుడ్‌ హోప్‌ అగ్రంగుండా సముద్ర ప్రయాణం ప్రమాద పూరితమైంది కావడంతో మొదటి ఎలిజబెత్తు రాణి తన అనుమతిని ఇచ్చి తగిన విధంగా ప్రోత్సహించలేక పోయింది

1583లో రాల్ఫ్‌ ఫిల్స్‌ అను ఆంగ్లేయుడు పర్షియా గల్ఫ్‌ ప్రాంతం చేరుకున్నాడు. ఇతనిని పోర్చుగీసువారు బందించి గోవాకు తీసుకువచ్చారు. కాని ఇతడు చెరనుండి తప్పించుకుని మలక్కా_ దీవికి వచ్చి అక్కడినుండి మాతృభూమికి చేరుకున్నాడు. భారత దేశ సంపదను గురించి ఇతడు అందజేసిన వివరాలతో తూర్పు దేశాలతో వ్యాపారం నిర్వహించాలన్న బ్రిటీషు వర్తకుల వాంఛ ద్విగుణీకృతమైంది. క్రీ శ 1588లో స్పెయిన్‌ దేశంపై ఇంగ్లండు విజయం సాధించడంతో ఈ వర్తకుల్లో కొత్త ఆశలు చిగురించాయి. డచ్చి ప్రయాణీకుడైన వాన్‌ లిన్స్‌ కొటెన్‌ ప్రచురించిన రెండు పుస్తకాలు అందజేసిన వివరాలతో బ్రిటీషు వర్తకులకు సముద్రయానాన్ని గురించిన భయాలు తొలగిపోయాయి. దీంతో లండను వర్తకులంతా కలసి తూర్పు దేశాలతో వ్యాపారం నిర్వహించేందుకు అనుమతిని ఇవ్వవలసిందిగా ఎలిజబెత్తురాణికి విన్నవించుకొన్నారు. దీనికి రాణి అంగీకరించడంతో 1600 సంవత్సరపు చివరి రోజున ఇంగ్లీషు ఈస్టిండియా వర్తక సంఘం ఏర్పాటయింది. గుడ్‌ హోప్‌ అగ్రంనుండి మెగల్లాక్‌ జలసంధి వరకు గల ప్రాంతంపై వ్యాపార నిర్వహణలో 15 సంవత్సరాలపాటు గుత్తాధిపత్యం లభించింది కంపెనీ పాలనా వ్యవహారాల్ని నిర్వహించేందుకు ఒక గవర్నరు, 24 మంది సభ్యులు గల ఒక కమిటీని నియమించడం జరిగింది కాని తర్వాత ప్రతి సంవత్సరం కంపెనీ