పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

33

ఆక్రమించాడు. శ్రీ కృష్ణదేవరాయలు పోర్చుగీసు వారితో స్నేహ సంబంధాల్ని ఏర్పరచుకొని గోవా పోర్చుగీసు వారి ఆధీనంలో ఉండేందుకు అంగీకరించాడు పోర్చుగీసువారు మలక్కాదీవిని ఆక్రమించడమేగాక ఆగ్నేయాసియాలోని దీవుల్ని కూడ స్వాధీనం చేసుకున్నారు

తూర్పు దేశాలతో నిరాటంకంగా సాగుతున్న పోర్చుగీసు వ్యాపారానికి క్రీ శ 16వ శతాబ్ది చివరి కల్లా డచ్చి దేశీయుల నుండి పోటీ ఎదురయింది లిస్బన్‌ వంటి నౌకా కేంద్రాలనుండి సుగంద ద్రవ్యాలు మొదలగు తూర్పు దేశపు వస్తువుల్ని కొనుగోలు చేసి డచ్చివారు ఉత్తర యూరపులో అమ్మేవారు కాని 1594లో స్పెయిన్‌ - పోర్చుగల్‌ రాజైన రెండవ ఫిలిప్‌ తన రాజ్యంలోని లిస్బన్‌ మొదలగు నౌకాకేంద్రాలలోకి డచ్చివాళ్ళ ప్రవేశాన్ని నిషేదించాడు దీంతో సుగంధ ద్రవ్యాలు డచ్చి ప్రజలకు అందకుండా పోయాయి. తూర్పు దేశాల వస్తువుల్ని నేరుగా కొనుగోలు చేయడానికి డచ్చివారు నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో తూర్పు దేశాలతో వ్యాపారం నిర్వహించేందుకు డచ్చివారికి అనుకూలవాతావరణం ఏర్పడింది

వాన్‌‌లిన్స్‌ కొటన్‌ అను డచ్చి ప్రయాణీకుడు ఆగ్నేయాసియాలో దాదాపు తొమ్మిది సంవత్సరాలు గడపి క్రీ శ 1592లో మాతృభూమిని చేరుకున్నాడు. ఆయన తన అనుభవాల్ని రెండు పుస్తకాల రూపంలో వెలువరించాడు. వీటిలో 1595లో వెలువడిన Rcvsgeschrift అనే పుస్తకం మొదటిది. 1596 లో వెలువడిన Itincrario అన్నది రెండవది. మొదటి పుస్తకం తూర్పు సముద్రాల నావికా మార్గాల్ని సూచించేది కాగా, రెండవది తూర్పు దేశాళ్లో తాను జరిపిన ప్రయాణపు అనుబవాల్ని గురించి చెపుతుంది ఈ రెండు పుస్తకాలు యూరోప్‌పై విపరీత ప్రభావాన్ని చూపాయి. మొదటి సారిగా తూర్పు దేశాల్ని గురించిన నిజమైన వివరాల్ని యూరోపియనులు తెలుసుకో గల్గారు. హాలండు దేశ వర్తకులు 1595లో వర్తక సంఘాన్ని (Campaignie Van verrc) ఏర్పాటు చేసుకొన్నారు. కార్నెలిస్‌ ది హాట్‌ మాన్‌ నాయకత్వంలో వారు ఆగ్నేయాసియాకు వ్యాపార సాహస యాత్రకు ఉపక్రమించారు. క్రీ. శ. 1596 జూన్‌ నెలలో జావాకు వాయవ్య తీరంలో వున్న 'బాంతమ్‌' ఓడ రేవుకు చేరుకున్నారు. ఈ వ్యాపార యాత్ర విజయవంతం కావడంతో 1595-1601 మధ్య కాలంలో పోటీ మనస్తత్వంగల కొన్ని స్వతంత్ర