పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

29

దౌలతాబాదులోని చెఱసాలలో ఉంచబడ్డాడు. 1687 అక్టోబరు నెలలో గోల్కొండ రాజ్యం పతనమయింది. దీంతో కుతుబ్‌షాహి వంశపాలన అంతమయింది. గోల్కొండ మొగలు సామ్రాజ్యంలో విలీనం చేయబడింది.

మొగలుల దక్కను ఆక్రమణ

తాళికోట యుద్ధం (25 జనవరి 1565) తర్వాత దక్కను సుల్తానులు పూర్వంలాగే‌ పరస్పరం కలహించుకోవడం ప్రారంభించారు. వీరి కలహాల్ని ఆసరాగా తీసుకొని దక్కనులో తన ఆధిపత్యాన్ని స్థాపించాలని మొగలు చక్రవర్తి అక్బరు ప్రయత్నించాడు మొదట క్రీ. శ 1695లో అహ్మదునగరును ముట్టడించాడు. రాణి అయిన చాంద్‌ బీబీ నగరాన్ని రక్షించడానికి సర్వశక్తులా ప్రయత్నించింది. అయినా లాభం లేకపోయింది. మొగలుల ఆధిపత్యాన్ని అంగీకరించి, బీరారును వదలుకోవలసి వచ్చింది క్రీ శ 1600లో రెండవసారి మరో దండయాత్రని ఎదుర్కోవలసి వచ్చింది. తర్వాత షాజహాను కాలంలో ఈ రాజ్యం మొత్తాన్ని మొగలు సామ్రాజ్యంలో విలీనం చేయగల్గారు.

షియా తెగకు చెందిన గోల్కొండ, బిజాపూరు రాజ్యాలంటే షాజహానుకు వ్యతిరేక భావం ఉండేది. అందువల్ల క్రీ శ 1636లో ఈ రాజ్యాలపై దండయాత్ర చేసేందుకు తన సెన్యాన్ని దక్కను ప్రాంతం వైపు నడిపించాడు

గోల్కొండ ప్రభువైన కుతుబ్‌ షాహి వంశస్థుడు అబ్దుల్లా, షాజహాన్‌ ఆధిపత్యాన్ని అంగీకరించి ప్రతిఏటా కప్పం కట్టడానికి ఒప్పుకున్నాడు ఔరంగజేబు దక్కను ప్రాంతానికి మొగలుల రాజప్రతినిధిగా నియమించబడ్డాడు అప్పటికి దక్కను ప్రాంతంలో ఖాందేష్,‌ బేరారు, దౌలతాబాదు, తెలంగాణా కొంతభాగం మొగలుల ఆధీనంలో ఉండేవి. 1644లో ఔరంగజేబు ఆగ్రాకు తిరిగి వచ్చాడు. మరల 1653లో జౌరంగజేబు దక్కను ప్రాంత రాజప్రతినిధిగా రెండవసారి వచ్చి నాలుగు సంవత్సరాల పాటు గడిపాడు

గోల్కొండ పతనం

క్రీ. శ. 1682లో ఔరంగజేబు మహారాష్ట్రుల ఆధిపత్యాన్ని, బిజాపూరు, గోల్కొండ రాజ్యాల్ని అణచివేయడానికి చక్రవర్తి హోదాలో స్వయంగా వచ్చాడు. 1686లో బిజాపూరును స్వాధీనం చేసుకున్నాడు. 1685 జూన్‌