పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27

మరల అయిదు కొత్త సుల్తానుల రాజ్యాలు లేచాయి. అవి 1.ఇమాద్‌ షాహి వంశం పాలించే బేరారు 2 నిజం షాహి వంశం పాలించే అహమ్మదు నగరు ౩ ఆదిల్‌ షాహి వంశం పాలించే బిజాపూరు 4 కుతుబ్‌షాహి వంశం పాలించే గోల్కొండ 5 బరిదుషాహి వంశం పాలించే బీదరు రాజ్యాలు.

కుతుబ్‌షా (1512-1543)

సుల్తాను కులి షియా జాతికి చెందినవాడు క్రీ శ 1514లోను, 1530లోను బీదరు, బీజాపూరుల మధ్య జరిగిన కలహాల్లో ఈయన బీదరుకు సహాయాన్ని అందించాడు దాదాపు 98 సంవత్సరాలు జీవించి తన కుమారుడైన జంషిద్‌ చేత చంపించబడ్డాడు

జంషిద్‌ (1543-1550)

జంషిద్‌ ఏడు సంవత్సరాలు మాత్రమే పాలించినా బీజాపూర్‌ లో అనేక యుద్దాలు చేశాడు క్రీ శ 1550లో శైశవదశలో ఉన్న తన కుమారుడైన నుబాన్‌‌ను రాజుగా ప్రకటించి ప్రాణాలు వదిలాడు కాని సుబాన్‌ మామయై న ఇబ్రహీం అతనిని పదవీచ్యుతుణ్ణి చేసి సుల్తానుగా తన్ను తాను ప్రకటించుకున్నాడు

ఇబ్రహీం (1550 -- 1580)

ఇబ్రహీం అహమ్మదునగరు సుల్తాను మొదటి హుస్సేను నిజాంషా కుమార్తెను వివాహమాడాడు. విజయనగర రాజ్యానికి వ్యతిరేకంగా ముస్లిం కూటమిని ఏర్పాటు చేయడంలో ఇబ్రహీం నాయకత్వం వహించాడు. ఈ కూటమే 1565లో జరిగిన తాళికోట యుద్ధంలో విజయగనర సామ్రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేసింది ఇబ్రహిం కాలంలోనే వరంగల్లు శాశ్వతంగా గోల్కొండ రాజ్యంలో కలిపివేయబడింది.

ముహమ్మదు కులి కుతుబ్‌షా (1580-1612)

హైదరాబాదు నగర స్థాపకుడుగా పేరుగాంచిన ముహమ్మద్‌ కులి కుతుబ్‌ షా 1589లో గోల్కొండకు పది మైళ్ళ దూరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాడు ఈ నగరానికి తన హిందూ ప్రేయసియైన భాగమతి పేరు మీదుగా 'భాగ్యనగరు' అని పేరు పెట్టాడు. తర్వాత కాలంలో ఈ భాగ్యనగరాన్నే హైదరాబాదు అని