పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

తలదూర్చేవాడు 1543లో రామరాయలు అహమ్మదు నగరు, గోల్కొండ సుల్తానులతో చేతులు కలపి బిజాపూరు రాజ్యంపై దండెత్తాడు పదిహేను సంవత్సరాల తర్వాత (1558) బిజాపూరు సుల్తానుతో చేతులు కలపి అహమ్మదు నగరుపై దండయాత్ర చేశాడు. ఈ పరిస్థితుల్లో ముస్లిం రాజ్యాలు కూడ పల్కుకొని తమ మధ్యగలవైరాన్ని విస్మరించి కలసికట్టుగా రామరాయలపై యుద్ధాన్ని ప్రకటించడానికి నిర్ణయించాయి దీని ఫలితమే తాళికోట యుద్దం

రాక్షస తంగడి అని కూడ వ్యవహరింపబడే ఈ తాళికోట యుద్ధం జనవరి 25, 1565న జరిగింది మొదట విజయనగర సైన్యానికి విజయం చేకూరినా, ముస్లింల కాల్బలం ముందు వారు నిలువలేకపోయారు. ముస్లింల బందీగా చిక్కిన రామరాయల తలను అహమ్మదు నగరు సుల్తాను హుస్సేను నిజాంషా నరికి వేశాడు

తాళికోట యుద్దం తర్వాత ముస్లిం రాజ్యకూటమి మరల విడిపోయింది యధాప్రకారం అంతఃకలహాలు మొదలయ్యాయి ఈ పరిస్థితి రామరాయల తమ్ముడైన తిరుమల రాయల పాలనలో విజయనగరం తిరిగి కోలుకోవడానికి దోహదపడింది 1570లో తిరుమల రాయలు నామమాత్రంగా సాగుతున్న సదాశివరాయల్ని పదవీచ్యుతిని చేసి సింహాసన మదిష్టించాడు ఈ విధంగా ఆరవీడు వంశరాజుల పాలన మొదలయింది విజయనగరాన్నేలిన చివరి రాజవంశం గూడ ఇదే రెండవ వెంకట రాయల కాలంలో విజయనగర రాజధానిని చిత్తూరు జిల్లాలోని చంద్రగిరికి మార్చారు ఆరవీడు వంశం క్రీ.శ 1675 వరకు తన అధికారాన్ని కొనసాగించగల్గింది

కుతుబ్‌షాహి వంశం గోల్కొండ‌ రాజ్యం ( 1512 1687)

విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన తొమ్మిది సంవత్సరాలకు (క్రీ. శ 1347 లో) అల్లాయుద్దీన్‌ జాఫర్‌ ఖాన్‌ బహమనీ దక్కను ప్రాంతంలో బహమనీ రాజ్యంగా వ్యవహరింపబడే ఒక ముస్లిం రాజ్యాన్ని స్థాపించాడు. ఈ బహమనీ రాజ్యం రాయచూరు ప్రాంతంపై (కృష్ణ తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం) పట్టు సంపాదించడం కోసం విజయనగర రాజ్యంతో అనేక యుద్దాలు చేసింది. చివరికి 1526లో పతనమయింది. పతనమయిన ఈ బహమనీ రాజ్యంలో