పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

25

యుగానికి రాయల కాలాన్ని పోల్చవచ్చు. రాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలనే ఉద్దండ కవులుండేవారు. వీరిలో మనుచరిత్ర కారుడైన అల్లసాని పెద్దన సాటిలేని మేటి కవిగా ప్రసిద్ది చెందాడు ఈయన్నే ఆంధ్రకవితాపితామహుడని కూడ అంటారు. పారిజాతాపహరణ కావ్యాన్ని వ్రాసిన నందితిమ్మన మాదయగారి మల్లన, దూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు, తెనాలి రామలింగ కవి అష్టదిగ్గజాల్లోని మిగిలిన కవులు. రాయలు కూడ స్వయంగా గొప్ప కవిత్వాన్ని ఛెప్పగల్గాడు. ఆయన రచించిన 'ఆముక్తమాల్యద' అనే గ్రంధం తెలుగు సాహిత్యంలో ఎన్నదగిన ప్రబంధంగా గుర్తింపబడింది. రాయలు సంస్కృత కన్నడ సాహిత్యాల్ని కూడ పోషించాడు

శ్రీకృష్ణదేవరాయలు గొప్ప కట్టడాలు నిర్మించాడు విజయనగరంలోని హజార రామాలయం, విరలస్వామి ఆలయం రాయలు నిర్మించినవే. తన తల్లి జ్ఞాపకార్ధం నాగలాపురమనే పట్టణాన్ని నిర్మించాడు ఒక మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణదేవరాయలు ఆసియా, ఐరోపా దేశాల్లో విరాజిల్లిన గొప్ప చక్రవర్తులతో సమానుడని చెప్పవచ్చు.

విజయనగర సామ్రాజ్య పతనం

శ్రీకృష్ణదేవరాయల తర్వాత ఆయన సవతి తమ్ముడు అచ్యుతరాయలు క్రీ శ 1530 నుండి 1542 వరకు రాజ్యపాలన చేశాడు అచ్యుతరాయలు కౄరమైన మనస్తత్వం కలవాడు కావడంతో రాజ్యపాలనం సక్రమంగా చేయలేకపోయాడు. అధికారాన్నంత తన మంత్రియైన ఆరవీడు రామరాజు చెలాయించేవాడు. ఆరవీడు రామరాజు కృష్ణదేవరాయల అల్లుడు అచ్యుతరాయల తర్వాత ఆయన కుమారుడు మొదటి వెంకటరాయలు రాజ్యాదికారానికి వచ్చాడు కాని అనతికాలంలోనే మరణించాడు. తర్వాత రామరాయలు అచ్యుతరాయల తమ్ముడి కుమారుడైన సదాశివరాయల్ని క్రీ. శ 1543లో రాజుగా ప్రకటించి ప్రభుత్వాన్ని తానే నిర్వహించాడు.

తాళికోట యుద్ధం (క్రీ. శ. 1565)

తన అధికారాన్ని, కీర్తిని పెంచుకునేందుకు రామరాయలు దక్కను సుల్తానులైన బిజాపూరు, అహమ్మదు నగరు, గోల్కొండ పాలకుల వ్యవహారాల్లో