పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

చేసి చంపాడని రాయలకు తెలిసింది అందువల్ల తిమ్మని, తిమ్మరుసును బంధించి వారి కళ్లు పీకించి వేశాడు. ఈ పరిణామాల వల్ల శ్రీ కృష్ణదేవరాయలు తన చివరిరోజుల్లో అశాంతికి గురయ్యాడు. తన సవతి తమ్ముడైన అచ్యుతరాయల్ని రాజుగా ప్రకటించి క్రీ. శ 1529 సంవత్సరాంతంలో మరణించాడు.

రాయల గొప్పతనం

దక్షిణ భారతాన్నేలిన రాజుల్లో శ్రీకృష్ణదేవరాయలు ఒక విశిష్ఠ స్థానాన్ని ఆక్రమించాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. గొప్ప యుద్దవీరుడుగా, సమర్దుడైన పాలకుడుగా, కళాసాహిత్యాల ఉదారపోషకుడుగా, శ్రీకృష్ణదేవరాయలు కీర్తిని గడించాడు ఆయనే ఒక ఇతిహాసంగా మారిపోయాడు. చదవులు రాని గ్రామస్థులు, పిల్లలు కూడ రాయల విజయాల్ని గూర్చి నెమరు వేసుకుంటారు రాయల సామ్రాజ్యానికి కేంద్రస్థానంగా ప్రస్తుత ఆంధ్రదేశంలోని రాయలసీమ జిల్లాలు ఉండేవి

ఒక యుద్ధవీరుడుగా రాయలు తన పరాక్రమాన్ని శత్రురాజులైన దక్కను సుల్తానులకు, ఒరిస్సా పాలకులకు చవిచూపించాడు బహమనీ రాజ్యంపై రాయలు చేసిన దండయాత్రలు అతని సైనిక శక్తిని, యుద్దవ్యూహాన్ని స్పష్టం చేస్తాయి దక్కను ప్రాంతంలో రాజకీయ సుస్థిరతను కాపాడటానికి రెండుసార్లు బహమనీ రాజవంశాన్నే సింహాసనంపై అదిష్టింపచేశాడు ఇదే విధంగా పోర్చుగీసువారితో రాయలకున్న స్నేహసంబందాల వల్ల 16వ శతాబ్దిలోని రాజకీయ పరిస్థితిని రాయలు క్షుణ్ణంగా అర్దం చేసుకున్నట్టు మనకు అర్దమవు తుంది. రాయలు జరిపిన ఒరిస్సా దండయాత్రలు ఆ కాలం నాటి సైనిక చరిత్రలో గొప్ప విజయాలుగా మిగిలిపోయాయి.

పాలకుడుగా రాయలు తన సామర్ద్యాన్ని నిరూపించుకున్నాడు విస్తృతమైన విజయనగర సామ్రాజ్యాన్ని మండలాలుగాను, నాడులుగాను, సీమలుగాను విభజించి చిన్నచిన్న గ్రామాలు కూడ ప్రభుత్వం వల్ల ప్రయోజనం పొందేటట్టు చూడగల్గాడు

కళాసాహిత్య రంగాలకు ఆశ్రయమిచ్చి వాటిని పోషించడంలో రాయలకు మించినవారు లేరు తెలుగు సాహిత్య చరిత్రలో రాయల యుగాన్ని స్వర్ణయుగంగా భావించవచ్చు ఇంగ్లాండులో ఎలిజబెత్తు యుగానికి గ్రీసులో 'పెరిక్లీను'