పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23

తర్వాత నాదెండ్ల గోపన్న అధీనంలో ఉన్న కొండవీడును చుట్టుముట్టాడు నాదెండ్ల గొపన్న శ్రీకృవ్ణదేవరాయల మంత్రియైన తిమ్మరుసుకు మేనల్లుడు. గోపన్న గోల్కొండ సెన్యాన్ని సమర్దవంతంగా ఎదుర్కోలేకపోయినపుడు తిమ్మరుసు స్వయంగా సైన్యాన్ని నడిపించి గోల్కొండ సైన్యాన్ని ఓడించడమే కాక వారి సేనాపతియై న మదరుల్‌ ముల్కును బంధించాడు.

బిజావూర్‌

శ్రీకృష్ణదేవరాయలు చివరిసారిగా బిజాపూర్‌ ను పాలిస్తున్న ఇస్మాయిల్‌ ఆదిల్‌ షాపై దండయాత్ర చేశాడు క్రీ శ 1512లో రాయలచే ఆక్రమింపబడ్డ కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని తిరిగి బిజాపూరుకు స్వాధీనం చేయవలసిందిగా సుల్తాను కోరాడు. ఈ నేపధ్యంలో సాగిన యుద్దంలో బిజాపూరు సైన్యం చిత్తుగా ఓడిపోయింది. తర్వాత శ్రీకృవ్ణదేవరాయలు గుల్బర్గా వరకు తన సైన్యాన్ని నడిపించి అక్కడ గల కోటను ధ్వంసం చేశాడు ముహమ్మదుషా పెద్ద కుమారునికి బహమనీ రాజ్యాన్ని అప్పగించి మిగిలిన ఇద్దరు కొడుకుల్ని బంధీలుగా విజయనగరానికి తీసుకుపోయాడు.

పోర్చుగీసులతో సంబంధాలు

శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు వారితో స్నేహపూర్వక సంబంధాల్ని కలిగియుండేవాడు. క్రీ శ 1510లో భారతదేశంలోని పోర్చుగీసుల ఆధీనంలో గల ప్రాంతాలన్నింటికి గోవా కేంద్రస్థానమయింది. దీని ఫలితంగా వాణిజ్యం అభివృద్ది చెందింది శ్రీకృవ్ణదేవరాయలు ఆరేబియా గుర్రాల్ని పోర్చుగీసు వారి ద్వారా పొందేవాడు ఇదేకాక పోర్చుగీసువారు తుపాకులు మొదలయిన యుద్ద సామాగ్రిని కూడ విజయనగరానికి అందచేశారు. ఈ ఆయుధసామగ్రితోనే రాయలు రాయచూరుపై దండెత్తాడు. విజయనగరానికి నీరు సరఫరా చేసేందుకు పోర్చుగీసు ఇంజనీర్లు సహాయపడ్డారు

శ్రీకృష్ణదేవరాయలు చివరి రోజులు విషాదకరంగా మారాయి రాయలు తాను జీవించి ఉండగానే తన చిన్న కుమారుడైన తిరుమలదేవుని విజయనగర రాజుగా చేశాడు కాని తిరుమలదేవుడు సింహాసనం అదిష్టించిన ఎనిమిది నెలలకే మరణించాడు తిమ్మరుసు కుమారుడైన తిమ్మడు తిరుమలదేవునికి విషప్రయోగం