పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

స్వాధీనం చేసుకున్నాడు కొండవీడును చుట్టుముట్టాడు. కాని సైన్యాధిపతియైన సాళువ తిమ్మయ కోటను వశపరుచుకోలేక పోయాడు. అందువల్ల శ్రీ కృష్ణదేవరాయలు స్వయంగా సైన్యాన్ని నడిపించి పెద్ద ఎత్తున దాడిచేశాడు చివరకు ఒరియా సైన్యం లొంగిపోయింది. యువరాజైన వీరభద్రునితో పాటు చాలమంది ఒరియా రాజప్రముఖులను బంధించి విజయనగరానికి తీసుకుపోయాడు

ఇక మూడవ దండయా[తలో కృష్ణానది ఒడ్డున గల బెజవాడను రాయలు స్వాధీనం చేసుకున్నాడు. గోల్కొండ మార్గంలో ఉన్న కొండపల్లిని కూడ ఆక్రమించాడు నల్గొండ, వరంగల్లు, జిల్లాలోని కోటలన్నీ విజయనగరం ఆధీనంలోకి వచ్చాయి.

నాల్గవ దండయాత్రలో వేంగి రాజ్యం తిరిగి స్వాధీనమయింది రాజమండ్రి అతి సునాయాసంగా చేజిక్కింది. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు సింహాచలం వెళ్ళి అక్కడి ఆలయంలోని నరసింహస్వామిని దర్శించాడు పొట్నూరు వద్ద తస విజయాలకు చిహ్నంగా ఒక విజయస్థంభాన్ని నాటించాడు

చివరిదైన అయిదవ దండయాత్రలో శ్రీకృష్ణదేవరాయలు గజపతుల రాజధానియైన కటకంపై దండయాత్ర సాగించాడు యువరాజైన వీరభద్రుడు విజయనగర చెఱసాలలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతాపరుద్రుడు సంధికి అంగీకరించాడు. క్రీ శ 1518లో జరిగిన ఒడంబడిక ప్రకారం ప్రతాపరుద్రుడు తన కుమార్తెను శ్రీకృష్ణదేవరాయల కిచ్చి వివావాం జరిపించాడు దీనికి ప్రతిఫలంగా శ్రీకృష్ణదేవరాయలు కృష్ణానదికి ఉత్తరంగా తాను ఆక్రమించిన ప్రాంతాలన్నింటినీ ఒరిస్సా రాజుకు తిరిగి ఇచ్చేశాడు.

గోల్కొండ

శ్రీకృష్ణదేవరాయలు ఒరిస్సా దండయాత్రలో తలమునకలై ఉండగా, గోల్కొండ సుల్తాను అయిన కులీకుతుబ్‌ షా పానగల్లు, గుంటూరు ప్రాంతాలపై దాడిచేసి వరంగల్లు, ఖమ్మంపేట, కొండపల్లి, ఏలూరు, రాజమండ్రిలో గల కోటల్ని స్వాధీనం చేసుకున్నాడు. ఒరిస్సా ప్రభువు నుండి కృష్ణా గోదావరీ ముఖద్వారాల మధ్య గల ప్రాంతాన్నంతా బలవంతంగా చేజిక్కించుకున్నాడు