పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21

సుల్తాను ప్రయత్నాలు ప్రారంభించాడు.

ఈ పరిస్థితుల్లో శ్రీ కృష్ణదేవరాయలు, విజయనగరంపై కలసికట్టుగా మతయుద్ధం (జీహాద్‌) ప్రారంభించే ప్రయత్నంలో ఉన్న దక్కను ముస్లిం పాలకులపై తన దృష్టి మరల్చాడు. ఈ ముస్లిం రాజ్యాల కూటమికి యూసఫ్‌ ఆదిల్‌ఖాన్‌ నాయకత్వం వహించాడు. కాని శ్రీకృష్ణదేవరాయలు, ముస్లిం కూటమి సైన్యాన్ని ఆదోని వద్ద చిత్తుగా ఓడించాడు. వెనుతిరిగిన ముస్లిం సైన్యాన్ని వెంటాడి కోవలకొండ వద్ద మరోసారి ఓడించాడు. ఈ యుద్దంలో యూసఫ్‌ ఆదిల్‌‌ఖాన్‌ మరణించాడు క్రీ శ. 1512లో రాయచూరును రాయలు ఆక్రమించాడు కృష్ణా - తుంగభద్రా నదుల మధ్య ప్రాంతమంతా శ్రీకృష్ణదేవరాయల అధీనంలోకి వచ్చింది. అక్రమంగా అధికారానికి వచ్చిన బారిద్‌ మమాలిక్‌ను తొలగించి మహమ్మద్‌ షాకు బహమనీ రాజ్యాన్ని తిరిగి కట్టబెట్టాడు

తర్వాత కృష్ణదేవరాయలు ఉమ్మత్తూరు పాలేగార్లపె తన దృష్టిని మరల్చి ఉమ్మత్తూరును స్వాధీనం చేసుకోవడమే కాక, శివసముద్రం, శ్రీరంగ పట్టణాల్ని కూడ వశపర్చుకున్నాడు

ఒరిస్సా దండయాత్ర

శ్రీకృష్ణదేవరాయలు ఒరిస్సా పాలకులపై అయిదుసార్లు దండయాత్ర చేశాడు ఒరిస్సా పాలకులు స్వాధీనం చేసుకున్న నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిని తిరిగి వశం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. క్రీ శ 1513లో దుర్బేద్యమై న ఉదయగిరి కోటపై దండెత్తి అతి పెద్దదైన ప్రతాపరుద్రుని సైన్యాన్ని ఓడించగల్గాడు. ఒరియా సైన్యం కొండవీడులో తలదాచుకోవలసి వచ్చింది. ఉదయగిరిని స్వాధీ నం చేసుకున్న తరువాత శ్రీకృష్ణదేవరాయలు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్దం తిరుపతిని సందర్శించాడు. తిరుమల గుడిలోని ద్వారం వద్ద తన విగ్రహాన్ని తన రాణులైన చిన్నాదేవి, తిరుమల దేవి విగ్రహాల్ని ప్రతిష్టించాడు.

శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాత శ్రీ కృష్ణదేవరాయలు మరల రెండోసారి ఒరియా పాలకులపై దండయాత్ర చేశాడు. కొండవీడు మార్గంలో గల కందుకూరు, వినుకొండ, బెల్లంకొండ మొదలైన కోటల్ని