పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

సంగమ వంశం (క్రీ. శ. 1336 -- 1485)

మొదటి హరిహరరాయలు (1336-1356), మొదటి బుక్కరాయలు (1356- 1377), రెండవ హరిహరరాయలు (1377-1406), మొదటి దేవరాయలు (1406-1422), రెండవ దేవరాయలు (1422-1465) మరియు విరూపాక్షుడు (1465-1485) వరుసగా సంగమ వంశానికి చెందిన రాజులు విరూపాక్షుని పాలనలో బహమనీ సుల్తాను ప్రధాన మంత్రియైన మహమ్మద్‌ గవాన్‌ విజయనగరంపై దండెత్తి వచ్చాడు విరూపాక్షుడు బహమనీ రాజ్యపు సవాలును ఎదుర్కోలేకపోయాడు. విరూపాక్షుడు తన కుమారుని చేత సంహరింపబడ్డాడు. కాని విరూపాక్షుని కుమారుడు పశ్చాతాపముచే పదవీ కాంక్షలేక సింహాసనాన్ని తన తమ్ముడైన ప్రౌఢదేవరాయలకు త్యాగం చేశాడు కాని చంద్రగిరి పాలకుడైన సాళువు గుండయ కుమారుడైన సాళువ నరసింహుడు ప్రౌఢదేవరాయలను పదవీచ్యుతుని చేసి‌ సింహాసనాన్ని అదిష్టించి కొత్త రాజవంశానికి నాందిపలికాడు

సాళువ వంశం (క్రీ. శ. 1485 - 1505)

ఈః వంశంలో సాళువ నరసింహరాయలు, ఇమ్మడి నరసింహరాయలు అను ఇద్దరు రాజులు మాత్రమే రాజ్యపాలన చేశారు.

తుళువ వంశం (క్రీ. శ. 1505 -- 1570)

క్రీ శ 1505 లో వీరనరసింహరాయలు ఇమ్మడి నరసింహరాయుల్ని సంహరించి సింహాసనం చేపట్టడంతో తుళువ వంశ రాజుల పాలన ప్రారంభమయింది వీరనరసింహరాయల తర్వాత అతని సవతి తమ్ముడైన శ్రీ కృష్ణదేవరాయలు 1509లో విజయనగర రాజ్యాధీశుడుగా పదవి బాధ్యతల్ని చేపట్టాడు.

శ్రీకృష్ణదేవారాయలు ( (క్రీ. శ. 1509 - 1529)

దక్షిణ భారతాన్ని ఏలిన రాజులందరిలోను శ్రీకృష్ణదేవరాయలు ప్రసిద్దుడైన గొప్ప చక్రవర్తి. 1509లో తాను రాజ్యాధికారం చేపట్టేనాటికి రాజ్యంలోని పరిస్థితులు అస్తవ్యస్తంగాను, నిరాశాజనకంగాను ఉండేవి. ఒరిస్సా పాలకులు నెల్లూరు వరకు గల తీరాంధ్ర దేశాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. విజయనగరాన్ని ఫణంగా పెట్టీ తన సరిహద్దుల్ని విస్తరింపజేయాలని బీజాపూరు