పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

ప్రతాపరుద్రుడు స్వయంగా నీతిశాస్త్రం అను గ్రంధాన్ని రచించాడు పాల్కురికి సోమనాధుడు రచించిన బసవపురాణం, పండితారాధ్య చరిత్ర ఈః నాటికీ ప్రసిద్ధి చెందిన కావ్యాలుగా మిగిలిపోయాయి. భాస్కరరామాయణం కూడ ఈకాలంలో వెలువడ్డ రచనయే ప్రసిద్దుడైన సుమతి శతక కర్త బద్దెన కూడ కాకతీయుల యుగానికి చెందినవాడే

కళలు

కాకతీయులు ఆలయాల్ని నిర్మిచడంలో శ్రద్ద కనపరిచారు అనమకొండలోని రుద్రేశ్వరాలయం, వరంగల్లు కోటలోని స్వయం భూనాధ దేవాలయం కాకతీయులు చేపట్టిన నిర్మాణాలే రామప్ప దేవాలయం, పిల్లల మర్రి దేవాలయాలు కళాజగత్తులో గొప్పవిగా నిలిచిపోయాయి. వరంగల్లు కోటలో కన్పించే గంభీరమైన నాలుగు మహాద్వారాలు ఆంద్రకళాకారుల నైపుణ్యానికి చిహ్నాలుగా దర్శనమిస్తాయి కాకతీయ రాజధానియైన వరంగల్లునే 'ఆంధ్రమహానగరం' అని కూడ వ్యవహరిస్తారు. ఆంధ్రదేశం లోని ఏ నగరానికి ఇటువంటి ఖ్యాతి లభించలేదు

సాగునీటి నిర్మాణాలు

కాకతీయుల కాలంలో వ్యవసాయం విశేషంగా అభివృద్ది చెందింది ఈ అభివృద్దికి కాకతీయ రాజులు నిర్మించిన అనేక చెరువులు కొలనులు, బావులు మొదలైనవి దోహదం చేశాయి. వీటిలో రామప్ప చెరువు పాకాల చెరువు పేర్కొనదగినవి. ప్రతాపరుద్రుడు కర్నూలు జిల్లాలోని అటవీ ప్రాంతమైన చాల భూభాగాన్ని వ్యవసాయ యోగ్యంగాను, నివాసయోగ్యంగాను చేసి అక్కడ వివిధ ప్రాంతాల ప్రజలు వచ్చి స్థిరపడేందుకు ప్రోత్సహించాడు

మతం

క్రీ శ. 11వ శతాబ్దిలో కాకతీయులు తమ అధికారాన్ని స్థాపించేనాటికి, ఆంద్రదేశంలో జైనమతం విశేష ప్రచారంలో ఉండేది. కాని రెండు శతాబ్దాలకే జైన మతం ఆంధ్రదేశం నుండి కనుమరుగైంది. జైనమతం స్థానంలో శైవమతం విశేషంగా వ్యాప్తిలోకి వచ్చింది. శ్రీపతి శివలెంక మంచన, మల్లిఖార్జున పండితారాడ్యుడు అను ముగ్గురు ఆంధ్రదేశంలో శైవమత వ్యాప్తికి