పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రస్తావన. ఆంధ్ర సోదరులారా ! ఈ చిన్నపుస్తకముకు 1917 వ సంవత్సరమున ఆంధ్ర మహాసభ నెల్లూరు పురమందు జఱిగిన వెంటనే, రాష్ట్ర ప్రతి వాదుల ఉపయోగార్థము వ్రాసియుంటిని. నాటినుండి దీనిని ప్రచురించుటకు నాకు వీలు లేకపోయెను. ఇట్టి ముఖ్యవిషయ మున నీ కాలవిలంబన కై క్షమింప వేడుకొనుచున్నాను. ఆసమ యమున పరిస్థితులొక వ్యూహముగానల్లుకొనియుండెను. ఇపుడు కొంత మారిమఱియొక వ్యూహముఁ బన్ని యున్నవి. కాని ఈపు స్తకమునందు వానిని స్వల్ప భేదములతో నట్లే యుంచితిని. వీల ·ననగా దీనిని వ్రాయుటయందు నాముఖ్యోద్దేశము మన జాతీయ పరిస్థితులు చర్చింపవలెనని గాదు ; ఇట్టి జాతీయపరిస్థితులకు బీజప్రాయములై కల్పించి, వానిని పరిణామదశ కాకృష్ఠిగా వింఛు బలవచ్ఛక్తులను కొంత పరిశీలింపవలెనని. అందుచే వారి స్థితులు కొంతవఱకు మాఱినను మున్ను వ్రాసినదానిని మార్చ నావశ్యకత గన్పట్టలేదు. అదియునుగాక, పరిస్థితులు మారు టయు దీనియందు ప్రతిపాదించిన వాదమును బలపఱచుచున్నది.