పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రమహోద్యమ తత్త్వము. మనతోటి కష్టములందు సైతము పాటుపడునా? మీదుమిక్కిలి యిప్పుడు 'మార్వారీఇంట రెస్టులను' కాపాడుకొనుటకై వారు మన లెజి స్లేటివ్ కౌన్సింలులో తమకుస్థానములు కావలెనని కొం చెముకొంచెముగా ప్రస్తావించుచున్నారు. ధనాఢ్యులు గావున వారియభీప్సితము నెఱవేరినను నెఱ వేరవచ్చును. వారిని మన దేశమునకు రమ్మని ఎవ్వరు పసుపుకుంకుమ బెట్టి బిలిచిరి ? మన దేశమున వీరియింట రెస్టులు కాపాడుకొనుట యనగా మన బారి నుండియేగదా? సమయము వేచి స్వలాభార్థమైవచ్చి, ఇపుడు 'తమ ఇంట రెస్టులు' కాపాడుటకు రిప్రెజెంటేషన్ కావ లెనఁట ! ఇవన్నియు జాత్యాక్రమణరహస్యములు. వారిని నేనుదూషిం చుట లేదు. స్వజాతివిజృంభణకు అది తప్ప వేరు మార్గము మాత్స్య న్యాయతత్వావలంబులగు యాధునికులకుఁ గన్పట్టదు. ఈమాత్స్య న్యాయతత్వము నేను మన వారికి బోధించుటలేదు. అది మిక్కిలి దూష్యము. కాని ఆయాదర్శములతో జాత్యా క్రమణము చేయవచ్చినవారి బారినుండి తప్పించుకొనుటకు మనము దానిరహస్యప్రవృత్తిని గ్రహించవలెను. పై జెప్పిన జాత్యా దేశమును, దానివలనఁ గలుగునుపద్రవ ములును వారింపవలెనన్న మనము ఎవరైననేమి అనుయాదా సీన్యమును దూరీకృతము చేయవలెను. ఒక జాతిస్థానమందు మఱియొక జాతిసత్వములు ప్రబలుచుండుట ఆజాతికి వినాశ హేతువని మనవారు విశదముగా తెలుసుకొనవలెను. • కాని పాఠకమహాశయులొక్క యాక్షేపణ సేయనగును. ఇంగ్లాండు దేశమున నెన్ని యోజాతులవారు ఇటీవల వలసలు వచ్చియు ఆం గ్లేయజాతి సుస్థితినుండ లేదా? వారివలన ఆంగ్ల జాతి నశించి

ఆంధ్రమహోద్యము తత్వము. X8 నదా? అని ప్రశ్నింపవచ్చును. దీనికి జవాబు ముందే చెప్పియు న్నాను. ఆంగ్లేయజాతి వ్యవస్థకును మనజాతి వ్యవస్థకుయెం తయో తారతమ్యము గలదు. ఆంగ్లేయజాతి వృద్ధిదశయం దున్నది. మనకున్ననో ఇకమీద వృద్ధి కావలసిన వారము. ఆంగ్లే జాతియందు స్వవ్య క్తిజ్ఞానము విశేషించియున్నది. వ్యక్తిజ్ఞానము మిక్కిలిగానుండు దేశమునకు స్వజాతివ్య క్తినిలుపు కొన లేని జాతి వాగువలసవచ్చి తమదేశమునకు రాకపోకలు లేక వెలియై రేని అట్టివారు మాత్స్యన్యాయమున ఆజాతులలో కలిసి పోదురు. రోమన్ కాథలిక్ క్రీస్తులగు రాజుల పోరు పడలేక ప్రెం ఛీహ్యోజినో లెందఱో ఇంగ్లాండు దేశములోనికి వలసవచ్చి తమ తమ జాతివ్యక్తిని కోలుపోయి వ్యక్తి పూర్ణులగు ఆంగ్లేయులలో నై క్యమైరి. విలియమ్ కాంకరర్ కాలమందు సంపూర్ణ వ్యక్తితో వచ్చిన నార్మనులుసై తము ఇంగ్లాండు దేశమునకు రాజులై నెగ డినను స్వజాతులతో గమనాగమనములు లేక కొద్ది కాలములో నే, జాతివ్యక్తిని నిలుపుకొనలేక ఆంగ్లేయజాతులవారిలో కలిసిపో యిరి. ఆంధ్ర దేశమున్న తదశ యందున్న పుడు వలసవచ్చిన పుదూ రు, తుమ్మగుంట, కోనసీమ ద్రావిడులు సైతము మాతృజాతివి స్మరణచే ఆంధ్రత్వమును స్వీకరించిది. ఇదంతయు ప్రయాణసౌక ర్యము లేని పూర్వకాలమున. ఇపుడన్ననో ప్రయాణ సౌలభ్యము కిఁ బోషించుకొన వలసవచ్చిన వారికి సాధ్య గలదు. స్వజాతివ్య క్తిఁ పడును. కానడాదేశమునందలిగల ఐరిషుజాతివారు ఐర్లండుకు స్వరాజ్యము కావలెనని కోరుచున్నారు. అమెరికా దేశమందలి జపానీజాతివారు మాతృజాతివ్యక్తిని పోషించుకొనుచు అమెరికా యందు హక్కులకై పోరాడుచున్నారు. ఇవన్నియు ప్రయాణ