పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రమహోద్యమ తత్వము. సౌలభ్యముచే తనేగదా? కావున ఈదినములలో మన యీ యాదాసీన్యము అనర్థకారి. మనకురు ఆంధ్రవ్య క్తిజ్ఞానము సం పూర్ణముగా నలవడినప్పుడు ఈ విషయమున నుదాసీనులై యుండవచ్చును. ఆంగ్లేయులుపై తము ఇటీవలగదా 'పర దేశస్థు లు తమదేశమునందు భూస్వాములుగా నుండగూడదను' నిషే ధముఁ దొలగించినది! స్వజాతివ్యక్తిపరిజ్ఞానము సంపూర్ణముగనుండు అమెరి కాదేశములో జపానీలు వలసవచ్చినపుడే అమేరికాలోని తుల కింతనష్టము రానున్నపుడు, అయ్యది పరిపూర్ణ ముగ లేక అధోలోకముననుండి ఇపుడే తల యెత్తవలెనని జూచు ఆంధ్ర జాతి స్థానమం దితరులు నొచ్చుట ఎంత ప్రమాదకరము? ముఖ్యముగా నట్టి వలసవారు అధికార వ్యాజమున వచ్చి రాజ్య పాలనమందు జోక్యముగలవారై లేని మనజాతికి యమమహిష ఘంటానాదములు వినబడుచున్నట్లే. అనివార్యమైన సందర్భము లలో మనమేమియు సేయునది లేదుగదా, వారింపగలిగిన విష యములలోఁగూడ నుదాసీనులమైనచో సద్గతి వడయు టెప్పుడు? మన ఇప్పటిదశయందు ఆంధ్రదేశమును అన్యులకు చిక్క బట్టియి చ్చినచో మనజాతికి మనమే విషముఁ బోసినవార మగుదుము. రాష్ట్రవాదులు రాజకీయోద్యోగములకై పాటుబడుచుండుట లేదు. ఆంధ్రవ్య క్తిపోషణకు అంతరాయములు గలుగుచున్న వనియు, ఆంధ్రజాతిక్షయ మందుచే ప్రతినిముషమును సన్ని హితమగుచున్న దనియు, వారిహృదయములు తల్లడిల్లుచున్నవి. వారిమొఱ రాష్టప్రతివాదులు చెవియొగ్గి విందురుగాక!

ఆంధ్రమహోద్యమ తత్త్వము. రాష్ట్రవాదులు ప్రతిపాదించు ఆంధ్రమహోద్యమము అత్యున్న తాదర్శములు గలయది. ఆంధ్రజాతి అంకురము వనస్ప తివలె మహావృక్షమై తనయూడలు దేశదిగంతములనాటి తన శాఖాచ్ఛాయల నెందఱో అనదజాతులవారు విశ్రాంతిదీర్చు కొనునట్లు చేయుపూనికతో ఆంధ్రులు పనిఁబూనుచున్నా రే గాని, ఎద్దియో క్షుద్రలతవలె అన్యాశ్రయము లేక నిల్వ లేని దానినిగాఁ జేయుటకు కాదు. జాతివ్యక్తి మఱచిపోయిన మనలను జూచి మనపూర్వులగు మహాంధ్రులు విద్యారణ్యకృష్ణ రాయా దులు స్వర్గముననుండియు ఎంత విషాదపరులగుచున్నారో మన మెఱుఁగుట లేదు. వారి మనో వేదనఁ బాపి పుత్రఋణముఁ దీర్చు కొనుట ఆంధ్రులకు విధి.నన వారు రాజకీ యోద్యోగాది స్వల్పా దర్శములమాని మహాదర్శములు గ్రహింతురుగాక. కాకిదృష్టి తోఁ జూచుటమాని గరుత్మంతునిదృష్టితోఁ జూతురుగాక. ఆం ధ్రత్వము ప్రతివానియందును పరిపూగోదయముం గాంచుఁగాక!

Printed at the India Printing Works, Madras.