పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇపుడు పైజెప్పిన రాష్ట్రప్రతివాదమందు సూచించిన కార్యధోరణితో పనిఁబూనిన రాఁగల నుపద్రవము చర్చింతము. ఇతరజాతివారిని మన ఆంధ్రదేశములోనికి రాజోద్యోగములపేరనో, మఱేపేరనో విశేషముగా రానిత్తమనుకొందము. దానివలని నష్టము మాత్రము మన మాలోచింపఁ బని లేదా? నేను చెప్పునది వారి కిచ్చు వేతనరూపమైన ధననష్టము గాదు. అది గణనీయము గాదు. దానికొఱకు ఇంతయాందోళన మనము చేయవలసిన ఆవశ్యకము లేదు. నేను చెప్పునది దీనియందు గల రహస్యోపద్రవము. స్వత్వజ్ఞానము లేక స్వత్వమును కాపాడుకొనలేనిస్థితియం దుండుజాతితో మఱియొకజాతి డీకొన్నపు డేమి జఱుగునో కొంచెము వివరించెదను. సజాతుల యభివృద్ధియందు అన్యజాత్యాదేశము[1] స్వతసిద్ధమేగాని జాతివినిమయము[2] ప్రకృతివిరుధ్ధము.[3] సజాతులవిలసనమం దెచ్చో జూచినను ఈవ్యవస్థ తెలియుచునే యున్నది. పాశ్చాత్యులు పోతరించి అమెరికాదేశములోనికి చొరనారంభించిన దాదిగా అచ్చటి రెడ్ఇండియన్లజాతి నామావశిష్టమయ్యెను. అట్లే ఆఫ్రికాఖండవాసు లగు నీగ్రోలు పాశ్చాత్యులదాడి కోర్వలేక స్వరూపనాశనముఁ జెందుచున్నారు. న్యూజీలాండు, ఆస్ట్రేలియా దేశములలో సైతము జాత్యాదేశమే కాననగుచున్నది. ఆర్యులు హిందూదేశమునకు వచ్చినపిమ్మట తత్పూర్వమున నుండిన దస్యులు రూపుమాసిపోయిరి. లేదా ఆర్యులలో ఐక్యమైపోయిరి. ఇంగ్లాండుదేశములో ఆంగ్లోసాక్సనులు వచ్చినవెనుక తత్పూర్వమున బ్రిటెనులో నివాసము జేయుచుండిన 'బ్రిటన్సు' అనుజాతివారు జాతినాశనమును పొంది వారిలో లీనమై స్వత్వభ్రంశమును పొందిరి. ఈసిద్ధాంతము జంతువులవిషయమున సహితము వర్తించుచున్నది. ఆస్ట్రేలియాగుఱ్ఱములను, అరబ్బీగుఱ్ఱములను హిందూదేశములోనికి దిగుమతిఁ జేయ నారంభించిన వెనుక సైంధవము మొదలగు ఆజాతి[4]గుఱ్ఱములు జాతివినాశము నొందినవి. ఇంక నిట్లెన్నియేని దృష్టాంతములు గాననగును. అట్లే ఇపు డాంధ్రమున అరవలు కర్ణాటులు మహారాష్ట్రులు ప్రబలినచో అంతవఱకును ఆంధ్రజాతి వినాశము నొందినట్లే. ఇది హాస్యాస్పదముగాఁ గన్నట్టునేమోగాని ఒక్కింత యోచించిన దీనితత్వము సంపూర్ణముగా మనస్సునకు రాఁగలదు. ఈచిన్నవిషయమును గమనింపుఁడు. మార్వారీవారికి మనదక్షిణదేశమున చోటిచ్చిన దోషఫలము నేడు మనకందఱికిని అనుభవరీత్యా తెలియుచుండుట లేదా? ఎచ్చట ధనముగలవాఁ డుండినను మార్వారీవాఁడే. వాఁడు మేయుపచ్చికబీడు దక్షిణదేశమున, వాడు పాలిచ్చునది ఉత్తరదేశమువారికి, ధనహీనుఁడై పైవస్త్రముతో ఉత్తరదేశమునుండి వచ్చిన మార్వారీవానికి వారు ధనము అప్పిచ్చి వానిని వ్యాపారమునందు నెలకొల్పి వాని నభివృద్ధికి దెచ్చుచుండుట చూచుట లేదా? అది వానియందు దోషముగాదు. కానీ మన కుపద్రవకారియే. మనదేశమున కేదైన యిక్కట్టు సంభవించిన వాఁడు తనధన మెత్తికొని తనదేశమునకు పాఱిపోవును గాని

  1. Substitution of one race by another.
  2. Interchange between two races or classes.
  3. This does not contradict my Statement in the preface that 'Natural selection' is an abberation from the normal condition of the universe. for so long as it is an abberation, it exists and therefore must enter our calculations.
  4. Local breeds