పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రమహోద్యమ తత్త్వము. దించుచున్నారము. ఆపట్ల అంతర్జాతి వైషమ్యములు కూడ వని చెప్పియుంటిమి. ఇచ్చటను అంతఃకులవైరములు పనికి రావు. అది యేమి కర్మమో, మనవారు జేయు యుద్యమములన్ని యు శ్లాఘ్యములై యుండ అచ్చటచ్చట పరస్పర వైరములు ప్రజ్వరిల్లుచున్నవి. ఈ యన్యోన్య జీవనా2 సహిష్ణుతకు పై జె ప్పిన రీతిగనే మొదటి కారణము బహిఃపీడన శక్తికిమించినదగు ట. మఱియు రెండవది: ఇపుడు హైందవులమనోవృత్తము భా వశూన్యగా నున్నది. చుట్టుప్రక్కల నెటుజూచినను వేరుపురు గువలె తొలుచుచుండు పాశ్చాత్యమనోవృత్తముచే జాతీయ మనోవృత్తి ఆలోచనరహితగాఁ జేయఁబడియున్నది. స్వజాతిమన స్సంస్థానమున కనురూపములగు తలపులును, భావములును చనిపోయినవి. అన్యజాతి తలపులును భావములును మనస్సం స్థితికి అనుగుణమైనవి 'కావు కావున మనములోని కెక్కఁజాల కున్నవి. “సముఁడై యెవ్వఁడు ముక్తకర్మచయుఁడై సన్యాసియై యొంటిబో| నమహాభీతి మెహో కుమారయనుచుకో వ్యాసుండు జీరంగవృ! క్షములుం దన్మయత ప్రతిధ్వనులు చక్కం జేసె మున్నట్టిభూ! తమయు౯......" అను పద్యమునందు చక్కగ చెప్పఁబడిన హైందవాదర్శపరిణామము మఱచిపోయితిమి. దానిబదులు మాత్స్యన్యాయమున ప్రతిపాదింపబడిన హిం సాప్రతిరూపమైన శాస్త్రసారమును యనుభవములోనికిఁ దెచ్చు కొన ప్రయత్నించుచున్నాము. (Survival of the fittest in existance.)__“జీవనార్ధమై the struggle for existance.) -“జీవనార్ధమై జఱుగు నిరంతర స్పర్ధయందు పాత్రులే విజయముఁ బొందుదురు. దుర్బలులు నశింతుర”నునీవాదము శక్త్యాసవపానమత్తులై లోకహితా హీ త

ఆంధ్రమహోద్యమ తత్వము. X3. ములరయ లేక భూతములవైపు పసిరికలు గ్రమ్మిన కండ్లతోఁ జూచి చెప్పినది, అదియే ప్రకృతికి స్వాభావికావస్థయఁట ! స్వాభావికావస్థయైన నాయెగాని, అది స్వభావధర్మమని దాని నొకమతముగాబోధించి మానవుఁడు దానిననుభవములోనికి దెచ్చుట చే వయ్యది హింసాప్రతిరూపమయ్యెను. లోకహితార్థ మీ ధర్మముకు డార్వినుదొరగారు గోపుర శిఖరములనుండి వెల్ల డించిన ఏబది సంవత్సరములలో మజెప్పుడుగాని ఏనూ రేండ్లలో జఱుగనంత యపకృతి లోకమునందు గావింపబడినది. మనమిపు డాధర్మము నుద్ధరింపఁ జూచుచున్నారము. అయ్యది హిందూ దేశప్రకృతికి విపరీతము. అందుచే నదిఇంకను మనరక్తనాళముల లోని కెక్కకున్నది. ఇది మనము స్వభావమునుఁగోలుపోయి అన్యభావము స్వీకరించుటకు చేయుప్రయత్నములు కుదాహర ణము. ఇట్లు రెంటికిం జెడిన మన భావవృత్తము నిర్వస్తు ప్ర శముగా నున్నది. పాడుపడినయిల్లు దయ్యములకును, చోరుల కును, గబ్బిలములకును శరణాలయముగ నుండలేదా? అశ్లీ భావరహితయైన మనజాతీయమనోవృత్తము బాహ్యదుర్భా వములకు శరణ్యమైయున్నది. ఎట్టి దుర్మోహారోపణ కై నను నయ్యది అతిశీఘ్రముతోడను మిక్కిలి యాదరముతోడను ప్రతిస్పందించును. అందుచేతనే స్వార్ధపరాయణులును నిజ కార్యైకదృక్కులును ప్రయోగించు దుర్మోహారోపణ దేశము నందు ప్రజ్వలించి ఇంతమంట మండుచున్నది.


1. దీని గుణాగుణములు విస్తరించుట నిచ్చట ప్రస్తుతము గాదు. శాన సందర్భవశమున నొకటిరెండు మాటలతో ముగింతును.