పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రమహోద్వము. కుఱచుకొన లేనంత మూర్ఖులుగానుండి రా? ఎన్నటికిని కాదు. వారు బుద్దిమంతులే స్వకులాభిమానులే. మునుపొకయాచా రము మనయభివృద్ధి కనరోధముకల్పింపక, ఇపుడదియే అనర్థ కరముగా దోచిన నట్టిమార్పునకు ఆయాచారము కారణము కానేరదు. సందర్భ సన్ని వేశములలోని మార్పే దానికి హేతు భూతము. ఆరోగ్యస్థితిలో రుచ్యమై హితమైనయన్నము రుగ్మత యందు చేదై యుండుట అన్న మునందలి దోషముగాదనీ తెలియ వలెను. ఆరోగ్యస్థితిమారి రుగ్మత సంభవించుటయే దానికి కారణము. అట్లే మనయందుఁగల అంతర్జాతిభేదములు మునుపు రుచించి, ఇపుడు రుచింపకపోవుటకు భేదములు కారణములు గావు. మనస్థితియందుమార్పే దానికి కారణము. జ్వరము గుదిర్చిన మరల యన్నము రుచించునట్లే స్థితి బాగుపఱచు కొనిన భేదములును అనింద్యములగును. ఈసూత్రము మన వారు బాగుగ నాలోచింపవలెను. మన ఉన్నత దశయం దీ భేదములుండి, మనదీనదశయందును ఈ భేదములుంట, మన దైన్యమునకు గాని అధ్యచ్యుతికిగాని ఇయ్యవి హేతువులు కావని స్పష్టమగుచున్నది. ఈ భేదములతోడనే మనము ప్రతాపరుద్రునికాలమున గణుతి కెక్కితిమి. ఈ భేదములతోడ నే మనము విద్యానగరరాజ్యమును అసమాన ప్రజ్ఞ తోడను, అపూ ర్వవిలాసముతోడను, అనల్పవై భవముతోడను ఏలితిమి. ఈ భేదములతోడనే మనము రాజరాజనరేంద్రునికాలమునఁ బ్రస్తు తిఁగాంచితిమి. కావున మన ఈదైన్యమునకు ఈ భేదములు కార ణములు కాఁజాలవు. కావుననే మన పురోభివృద్ధికిని ఈ భేదములు ఆటంకములు కానేరవు.


ఆంధ్రమహోద్యను తత్త్వము, ఈ భేదము లీరీతిగ నే స్థిరముగా నుండవలెనని నాయాశ యముగాదు. వీనిని నిర్మూలింపవలసినచో అట్లే చేతముగాక, లేక, సుస్కారమే చాలినచో అట్లే సంస్కరించుకొందము. అయ్యవి మనయధః పాతమునకు కారణము కానపుడును, మన భావివృద్ధికి అవరోధకములు కానపుడును అవి సరిపఱచినఁగాని మనకు ఆర్ధికవ్యవహారములయందు ముక్తి గలుగదను మనవా రికొందఱియాశయము నిరాధారము. అవి సరి చేసినగాని ఆర్టి వ్యవహారములయందు ముక్తికలుగనీక ఆటంక పఱతుమను వాదము మూర్ఖ పద్ధతి. సాంఘిక పరిస్థితులు సవరించువఱకును మన తరవిషయముల యభివృద్ధిచేకూరనిచో ఈలోపలనే జాతి క్షీణించిపోవునను భయము వొడముచున్నది. ఆర్థిక ఒక్కొక్క కులము వారును కులాభిమానులై వారివారి కులముల నభివృద్ధిపఱచుకొనఁ జేయు ప్రయత్నము లెంతయు శ్లాఘ్యములు. ఇపుడు మన దేశమందొక్కొక్క కులమునకును ఒక్కొక్క మహాసభఁ జేయుచున్నారు. ఇదెంతయు శ్రేయో దాయకము. ఏకులమువారు తదితరులయందు కంటె తుల్యకుల్యులయందు ఆదరమును, సానుభూతియు ప్రేమయునుఁ జూపుట న్యాయమే. ఆయాకులములు సంపూర్ణవిలసనమున కై వారువారు కులసమాధిలోనికిఁ బోవలెను. అట్లుగాని ఏ యేయం గములవారికి ఆయాయంగములు నిండుసత్వము తెలియదు. తెలిసినగాని వారు తమతమధర్మముల వివేకముతో నిర్వర్తించు టకు సమర్థులు కానేరరు. అంతర్జాతి సందర్భమునఁ జెప్పిన తత్వ మెల్లను అంతర్వర్ణ వియమునను పరిపోవును. అచ్చట యేయే ధర్మముల నుపపాదించితిమో నిచ్చటయు అవియే ఉపపా