పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రమహోద్యమ త త్త్వము. లేమిచే యాదవులు పరస్పరము కలహించి చంపుకొనిరి. రోమ నుసామ్రాజ్యము ఉచ్ఛైస్థితికి వచ్చిన పిమ్మట మార్కొనుటకు శత్రువులు లేమి చే రోమను యోధులు తమలో తాము కలహిం చిరి. ప్రస్తుతము ఐరోపామహాసంగ్రామమును ఇట్టిమూలము గలదే. పాశ్చాత్యులు దేశ దేశములు నాక్రమించి ప్రపంచ మెల్లను గచ్చపొదవలె నావరించిన పిదప బహిరుపద్రవము లేకపోవుటచే తమలో తాము పోరు సేయుచున్నారు. యాదవకుల మునకు ముసలము బుట్టెనను సమాసోక్తి యాదవకుల విషయ ముననే వర్తించు లోకోక్తిగాదు. విశ్వముపాలించు శాశ్వత ధర్మ మిందిమిడియున్నది. బహిఃపీడన లేక పోవుటచే అంతఃకల హములు జనించునట్లే, బహిఃపీడన శక్తికి మించిన దై నపుడు సైతము వైషమ్యము లుద్భవించును. గ్రామముచే దేశమున ఆహారము లేక పోయినపుడు క్షుద్బాధ సహింపరానిదైనచో, ఆదేశములోని జనులు తమ భ్రాతృవర్గములోనివారని యెఱి గియే అన్యోన్యముఁ జంపి బక్షింతురు. కార్తీజ్ మహాపట్టణ వాసులు హానిబాలు అను యోధాగ్రేసరుడు విజయము పొందినన్నాళ్లు అతనిని శ్లాఘించి, రోమ దేశపు సేనానాయ 3 కుఁడగు స్కిపియో తమ పట్టణముచుట్టును సేనలతో విడిసి నప్పుడు అపద వారింపరానిదగుట వారిలో వారుకలహించి హాని బాలును త్యజించిరి. ఇంక నిట్టియుదాహరణము లెన్ని యో చరిత్రనుండి ప్రత్యేకింపనగును. కావున మన జాతియందును అం ఈకలహములు జనించినచో వానికి కారణము లీరెంటియందే దేని ఒక్కటిగానుండవలెను. మనజాతికి బహిఃపీడనము బొత్తుగ లేకనైన నుండవలెను; లేదా, అయ్యది శక్తికి మించినదైన నుండ

ఆంధ్రమహొత్త్వము, వలెను. ఈరెంటిలో నేదైనది చెప్పనక్కర లేదు. ఒక్క వైపున క్రిస్టియన్ మిషణరీ' యొ త్తిడి, మఱియొక వైపున పాశ్చాత్య నాగరకతవలననైన యొత్తిడిగి, మూడవ వైపున పాశాత్య ఆర్థి కాభ్యున్న తిరి యొత్తిడి, నాల్గవవైపున పాశ్చాత్య వార్తాసంస్థితి నైన చల్లనియె త్తిడి. ఇట్లు నాల్గు వైపులనుండియు ఓర్వ రాని పీడ నములచే మిక్కిలి బాధపడుచున్నారము. కాలము గడుపను గడువను నీపీడనలు ప్రబలుచున్నవి. హైందవ జాతికిని ఆంధ్ర జాతికిని ఈ పీడనలు దుస్సహములగు చున్నవి. వీని బారినుండి తప్పించుకొను తెఱవుఁ గాన లేకున్నారము. మనదుస్థితికి కార ణము తెలిసికొన లేక దుర్మోహముచే బుద్ధిఁగోలుపోయి ప్రక్క నుండువార లే కారణభూతులనుకొని హిందువులు మహమ్మదీయు లను, బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులను, ఆంధ్రులు అరవలను, కర్షకులు భూస్వాములను, రాజ సేవకులు తదితరులను నిందించు కొనుచు పరస్పరముఁ జంపుకొనఁ జూచుచు న్నారము. ఇదియే మన యంతఃకలహముల తత్వము. అట్లుగా కుండిన బ్రాహ్మ ణులు బ్రాహ్మణేతరులును, ఎన్ని యో శతాబ్దములుగా సోదర భావముననుండినహిందూమహమ్మదీయులును, అన్యోన్యము వీడి బ్రతుకలేని నియోగి ఏల నేడొకరిపై నొకరు కత్తిదూయవలెను? ఇన్ని సంవత్సరముల నుండియు బ్రాహ్మ ణులు బ్రాహ్మణేతరులును, హిందూమహమ్మదీయులు, తమ తమ కుల గౌరవములను, కులసంస్థితులను తలపెట్టి అభివృది 1. Religious dismemberment, 2. Cultural aggression. 3. Political domination. 4. Economic Superiority.