పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రమహోద్యమ తత్త్వము. సదుద్యమమునకు భంగము కల్పించి, జాతిభ్రంశము నాపాదిం చినపాప మొడిగట్టుకొందుకు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రమిచ్చుటచే ఆంధ్ర భూస్వా ములకు భూమిపన్నులు హెచ్చునానియు, రాష్ట్రమువలనఁ గలు గులాభములు ఆంగ్లేయవిద్యావ్యవసాయకులకే సమకూరు చుండ దానివలని నష్టములుమాత్రము భూస్వాములకు వచ్చు ననియు, ఇపుడు రాజకీయ ఉద్యోగ వేతనములు ఆంధ్రులకు వచ్చినను, అర్థనలకు వచ్చినను, ఆంధ్ర భూస్వాములకు ఒక్కటి యేయనియు మఱియొక వాదము. ఇందలి మొదటి యంశము భూమిపన్నులు హెచ్చునని. అదివా స్తవ మగునా కాదా ? ఒక వేళ నిజమైనచో గవర్నరు మొదలగు ఉన్నతోద్యోగుల కేల వేతనములు తగ్గించి పన్నులు తగ్గించకూడదను ప్రశ్న చర్చిం చుట, తత్వము వ్రాయబూనిన మనపనిగాదు. కాని రెండవ యంశమందుగల తత్వనించుక విచారింపవలెను. అధికార వేతనములకై ఆంధ్రరాజ్యమును కోరుట లేదని ఇదినఱకే పరి పరి చెప్పియుంటిమి. కావున దానిని మరల ఖండింపబూను కొనవలసినది లేదు. కాని యట్టి మనవారియూ దాసీన్యము దేని యొక్క బహిర్విలసనమో చూడవలెను. ఇట్టి ప్రతివాదమును ప్రచోదించిన మనస్తత్వమును పరీక్షించవలెను. దీనియందుండు శక్తులు జాతి వై కల్యము నాపాదించునవిగా తోచుచున్నవి. ఆం గ్లేయ విద్యావ్యవసాయకులు రహితులు కాక పోయినను. స్వజా తీయు లేయని ఈవాద మొప్పుకొనుచున్నది. జాతిలోనివారే యని అంగీకరించుచు (వాస్తవముగా లాభమయినపక్షమున) వారిలాభము కొఱకు తామావంతయేని పాటుపడవలసిన విధి

ఆంధ్ర మహోద్యమ తత్త్వము . ૪. తమకు లేదని ఈప్రతివాదుల యాశయమని తేటపడుచున్నది. ఇట్టియా దాసీన్యము చేటుగూర్చునని చెప్పకతప్పదు. జాతీయన ప్రాణసహితమైన మువంటిదని ఇదినఱకే తెలిపియుంటిమి. దాని యంతర్భాగములకు అంగాంగ సంబంధము స్వతస్సిద్ధముగా నుండవలెను. అయ్యది లేనినాడు జాతి చైతన్యరహితయై నా శనమొదును. ఈ వాదమున, మనజాతీయందంగాంగానుబంధ పటుక్వము క్షీణించుచున్నదని తెలియుచున్నది. సమష్టి జ్ఞానము మాసిననాడు దేహము రోగావిష్టమగుట లేదా? అంగములకు చుకొనుట, గిల్లుకొనుట, వెండ్రుకలు చించుకొనుట మొదలైన నైపరీత్యములు జన్ని లక్షణములు. అట్లే జాతివిషయమునను, అంతర్జాతి వైషమ్యులును, అన్యోన్య క్షేమపరాఙ్ముఖత్వమును, జాతికి భావి ప్రళయ లక్షణములు. అట్టిలక్షణములచే సూచ్యమై న మ హెూపద్రవమును వారించుటకు ప్రయత్నములు చేయ వలెను. కాని ప్రయత్నము చేయక పూర్వము వైషమ్యములకు కారణము తెలియవలెను. ఏదేని ఒక జాతియందంతఃకలహము లు బుట్టుటకు కారణములు రెండు (1) బహిఃపీడన లేక పోవుట (2) బహిఃపీడన శక్తికి మించినదగుట. జాతికి బహిర్భాగమున నుండి వ త్తిడి లేక పోయినచో అంతర్భాగమున స్పర్ధలు జనించును. ఈవిషయము శాస్త్ర సిద్ధము. అన్య రాజన్యులనుండి యువ ద్రవము లేకపోవుటచే సార్వభౌములగు కౌరవపాండవులు పర స్పరముబోరి నశించిరి. వారలే గంధర్వరాజగు అంగారపర్ణు నిచే బాధితు లైనపుడు కలిసిపోరిరి. భారతయుద్ధానంతరము తక్కిన రాజవంశము లెల్లను నశించినపిమ్మలు బహిరుపద్రవము