పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రమహోద్యమ తత్త్వము. తోను జఱుగుచునే యుండును. పరిణామములగు ఆదర్శములఁ జేరువఱకును దీనికి విశ్రాంతి లేదు. కాని, దేశమం దెన్నియా బ్రాంతులు; ఎంతయో కుత ర్కము. ఎంతయో మార్ఖ్యము. మాఢ్యమును సవరింప వచ్చుఁగాని, మార్ఖ్యమును సరిపఱచుట యసాధ్యము. ఆంధ్ర రాష్ట్రము మనయరవసోదరులు నాంధ్ర దేశ పుపొలిమేరలు దాటి రానియ్యకుండుటకు కట్టు కంచెయని కొందఱవివేకులు దురభి ప్రాయములు తెలుపుచున్నారు. అట్టివారికి ఆంధ్రోద్యమ తత్వము మనస్సునందు సంపూర్ణముగ గోచరించలేదని యే చెప్పవలెను. అట్టి కుటిలాభిప్రాయములచే వారు తమ ప్రకృ అథోముఖగానో నేర్చుకొనుటయేకాక ఆంధ్రోద్యమము యొక్క ఆదర్శములను కొంచెపఱచుచున్నారు. ఆంధ్రోద్య మము గవర్న మెంటు సర్విస్ కొఱకై యింతపాటు పడుచున్న దా? రాజ సేవవిడిచి బహుజనము స్వతంత్రవృత్తియందు జీవిం చుటకై పాటుపడుచున్నది. ఇయ్యది రాష్ట్ర ప్రతివాది యొక్కొ క్కఁడును మనస్సునందు గట్టిగనమ్మవలెను. కానీ ఇట్టి దుష్ప్రం తికలుగుటకు కొంతవఱకును మనమే కారణము. కొంతవఱకు సూక్ష్మబుద్ది లేమియు కారణము. రాష్ట్రమువాదమందు " తెలు గుదేశమున రెండుకలాశాలలు, 'అరవదేశమున పది. తెలుగు దేశమువారొకఁడు హైకోర్టు జడ్జీ, అరవవారు నల్గురు" అనిమాత్స ర్యద్యోతమైన తర్క వాక్కులచే ఇంత ప్రమాదమునకు ఎడను య్యెను. దాని చేతనే ఈ ఆంధ్రోద్యమము ఈర్యాజన్యమను బ్రాంతి కడము గలిగి దాని పావన ప్రేమాకుందములు మనస్సు నకురాక మాసిపోవునట్లు తటస్థించెను. మనము సర్వకలాశాల

ఆంధ్రమహోద్యను తత్త్వము, లును హైకోర్టు జడ్జీలకును కుక్కలు ఎముకముక్కలకువ లె పోట్లాడుచుండ లేదు. రాష్ట్రవాదులు సయితము అట్టియభిప్రా యము గలవారుండిన వారు దానిని మార్చుకొనుట సమంజ సము. అట్లు మార్చుకొనక దుర్వ్యవసాయమునందు చలము వహించిన ప్రమాదము వాటిల్లును. ఆంధ్రులు ఈర్ష్యా గ్రస్థులను దురభిప్రాయమును నెలకొల్పరాదు. ఏలనన అట్టి నిందారోప కారణము మృగ్యము. నిరతిశయ ప్రేమాపరిపాక మే ఆంధ్రోద్యమమునకు మూలము. "ఆంధ్రజాతీయాదర్శముల జేరి, ఆంధ్రజాతివ్యక్తి ప్రతివాని మనమందును నాటుకొనునట్లు జేసి ఆంధ్రరాష్ట్ర పాలనాయంత్రమునకు మర్మము ఆంధ్రుల చేతికి వచ్చిన పిచుట, అరవవారినేగాదు, నీగ్రోలను సయితము గవర్నరుమొదలుకొని పరిచారకునివఱకును నియమించి రాజ్య ము సాగింతుము” అని ఒకానొకరు చెప్పిరి. అది ఎంతయు నిజము, ప్రాణములు మన చేతియందుండిన నిర్జీవమైన శనమేమి చేయఁగలుగును? ఇపుడు రాజ్యాంగ సంపానమునకు మర్మమం తయు ఆంగ్లేయుల పిడికిటియందుండ మనయానుశాసనిక సభ్యులు ను, మన హైకోర్టు జడ్జీలును మనక లెక్టరులును ఏమి చేయగలిగి యున్నారు? ఎపుడైనను అంతియయనుకొనుఁడు. ఈతత్వము నెఱిగియే ఆంధ్రోద్యమము రాష్ట్రాం సంస్థానముయొక్క మ ర్మము తమచేతిలోనికిఁ గొనబ్రయత్నించుట. రాష్ట్రవాదులు కొందలైన నీసూత్రమును గ్రహింపనినాడు మనయుద్యమము నకు ధర్మైక సంస్థితియును, ధర్మబలమును గ్రుంగుటయేకాక, దైహిక సత్వము సహితము తఱిగిపోవును. బహుజనులు దీనిని ఖండింతురు. రాష్ట్రప్రతివాదులు దీనిని దెలియక పోవుట చే