పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ولا ఆంధ్రమహోద్యమ తత్త్వము, మందిని మేలుకొల్పినది. అంతవఱకును సుగుణమేగాని తదితరు లకు మన యాదర్శతత్వముగాని ఆందోళనావిధానముగాని దుర్బోధ్యము. దీనియందు గల దౌర్బల్య హేతువరసి దానం గలుగు అవాంతరముల బలము నల్ఫీభూతము జేయఁ బ్రయ త్నింపవలెను. ఇన్ని నాళ్లుకు మనమియ్యది గమనింపకపోతిమి. నేడు ఆంధ్రోద్యమముతో నట్టియనాంతరముల తొలఁగఁ ద్రోయు తెఱఁ గేర్ప రు. ఇన్ని నాళ్లును హైందవోద్యోగము జీవము శరీరమువలె నిలువలేక కూలుచు నెట్లో నిలిచియుండెను. కావుననే మనము స్వరాజ్యమడిగినపుడు ఆంగ్లేయదొరల కల్లో లమంతమంతయు ఎడు కేటెడ్ క్లాసెస్' పెట్టినదేగాని జన సామాన్యముయొక్క అభిమతముకాదనిరి. దీనికి జవాబు మనకు లేకపోయెను. ఇట్టదుస్థితిని బాపి ఈయుద్యోగశరీరమునకు జీవమెట్లు సంధింపనగునో తెలియకుండెను. ఇటీవల బంగాళ ములో జఱిగిన దేశ భాషాపునరుజ్జీవనమువలననో లేక ఆంధ్రుల స్వభాషాభిమానమువలననో ఆజీవము ఆంధ్రోద్యమకూపమున లభించెను. దేశీయ మహాసభల యభిప్రాయములకు బలము గలిగించుటకును, నిరాకరింపడిన మన ఈప్సితముల నెవ్విద ముననైన సాధించుటకును మార్గమిదియే. ఇదియే మనప్రతి పక్షుల కుతర్కమునకు జవాబు. ఈ యాంధ్రోద్యమము చేయుచుండ అత్యల్ప దేశ భాషలయందే యాందోళనము చేయుచుండ కాలములోనే జనుల కందఱికిని రాజ్యాంగ వ్యవహారములు సుబోధ్యములగు చున్నవి. ముప్పది సంవత్సరములుగా ' జఱిగిన హైందవమహాజనసభ దేశములో నేమూలఁగాని పెట్టలేనంత సంక్షోభము ఆంధ్రమహాసభ ఐదు సంవత్సరములలో నెట్టి వేర్ప.

ఆంధ్రమహోద్యమ తత్త్వము, గలిగెను. ఆంధ్రులలో బహుజనము నేడు రాజకీయవ్య జుహార ములయందు జోక్యము పుచ్చుకొనఁగలిగియున్నారు. ఈ చర్చ లన్నియు నింగ్లీషు భాషలో జఱిగిన పక్షమున శ్రద్దపుచ్చుకొన లేనియ నేకులు మహోత్సాహముతో తమ సేమమును సమ కూర్చుకొనుటకై కంకణము గట్టుకొనియున్నారు. స్థూల ముగా ఆంధ్రమహాజనసభకును, దేశీయ మహాసభకును భేదమీ య్యది. వారు స్వరాజ్యమిప్పింపుఁడు అని దొరతనము వారిని ప్రార్ధించుచున్నారు. వీరు ప్రజలను ప్రార్థించుచున్నారు. ఈ రెంటిలో నెయ్యది యుత్కృష్టమో చెప్పనక్కర లేదు'. అట్లు సర్వార్థ కల్పద్రుమ మైఆంధ్రజాతి పూర్వపుణ్యమున సముజ్జీవితమైన ఈయాంధ్రోద్యమమునకు ప్రత్యేకాంధ్రరా ష్ట్రము సహాయకారి. ఇయ్యది ఆంధ్రజాతి ఆదర్శములు బడ యుటకు ఉపకరణమాత్రమని తెలియవలెను. ఆంధ్రరాష్ట్రమే. ఆంధ్రోద్యమమునకు పరిణామమని యెంచుట అవివేకమును, ఆంధ్రోద్యమ ప్రాపకుల యుద్దేశము గ్రహింప లేమియును. తన్మూలమున నితరములై అన్నిటికంటె నుత్కృష్టములై న యాదర్శముల జేరఁగలుగుదుమని యే సద్యగ కాలమున ఆంధ్ర రాష్ట్రమును గోరుట. ఆంధ్రజాతివ్యక్తి వెలయు జేయుట కిది సోపానమాత్రము. అట్లు కాదేని దైవసహాయమున ఆంధ్రరా ష్ట్రము మనకు శీఘ్రాకాలములో సమకూరిన మనమీయాందో ళన పరిత్యజింతుమా ? అసాధ్యము. అంధ్రరాష్ట్రము ప్రత్యే కింపబడిన ఆందోళనము మఱింత ప్రవేగముతోను, చలము

1. ఇది వ్రాసిన వెనుక దేశీయమహాసభయందు చాల పరివర్తనము జఱి గినవి, అడిసయితము ఆంధ్రమహాసభ మార్గములలో నే బడుచున్నది.