పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రమహోద్వము. ఆంధ్రోద్యమము హైందవోద్యోగమువలెగాక మిక్కిలి సత్వసారమైనది. హైందవోద్యోగము కొన్ని యనివార్య కా రణములఁబట్టి దుర్బలయైయున్నది. అందులో మొదటిది ఆంగ్లేయ భాషాపోషితులగు' హైందవుల చేనుద్ధరింపఁబడుట. ఈ విషయము పై కిచూచుటకు హాస్యాస్పదముగా నుండునుగాని తత్వము విచా రించిన నిందలి న్యూనత తేటపడఁగలదు. ఆంగ్లేయ భాషా పోషితు లగుటచే ఆదర్శవిచారమునందు హృదయసౌష్టము లేమియు, పాశ్చాత్యమార్గముల శిక్షనొందిన వారలగుటచే హైందవ జాతి వ్యక్తిగాని లేక హైందవ దేశోద్ధారణకు పాశ్చాత్యమార్గ ములే తారకమ లనుభ్రమయు దీనికి సద్యఃఫలములు. ఇప్పటికిని మన దేశమందు యాంత్రిక పరిశ్రమయు, ఆంగ్లేయ భాషయును మా త్రమేతప్ప మన కేడుగడ లేదని నమ్మువా రెండఱు లేరు? ఆంగ్లేయ సామ్రాజ్యమునుండి వారుమనల వెడలఁ గొట్టిన గాని, ఐరోపా నాగరకతఁ బో నాడినఁగాని మనకు బ్రతుకు దెరువు లేదని నమ్ము వారెందఱు లేరు? ఆంగ్లేయ సామ్రాజ్యము నుండి వారు మనల వెడలఁగొట్టరు. మనకీ భయమక్క అలేదు. ఐరో పానాగరకతఁ బోనడువవ లెనని మాయాశయముగాదు. కాని యాథాతథ్య ముగా తత్పరిగ్రహణము మనజాతివ్యక్తికి చేదు మ్రింగుటయని తెలియవలెను. ఐరోపా హైందవ నాగరకతల సంయు క్తి చే మన దాని కెంతవఱకు మెఱుఁగు రాఁగలదో అంత వఱకది పరిగ్రాహ్య మేగాని, హైందవనాగరకతను త్యజించి రెండవదానిని గ్రహిం చుట హిందూ దేశమందుఁగల వారిని రూపుమాపి పాశ్చాత్యుల 1 ఇటీవల నియ్యదిమాఱినది. ఈ సూత్రము మితవాది సామాన్యము యెడవర్తించును.

ఆంధ్రమహోద్యము తత్త్వము. నిచ్చట కాపురమిడుటయే అని చెప్పవలెను. ఐరోపా నాగరకతను యథామాతృకముగా మన మవలంబించినపిదప మనయందు హైందవమని చెప్పదగిన దేదియు నుండదు. జపా చీనా దేశస్థు లభివృద్ధి జెందిన మార్గమును ముచ్చటించుచు, టాల్ స్టాయ్ అను మహనీయుఁడు, చీనాదేశస్థునికి వ్రాసిన లేఖలో నిట్ల వివేకు లై అన్యజాతి నాగరకతను, అన్యజాతిమార్గములను, అన్యజాత్యా దర్శములను అవలంబించిరని మిక్కిలి చింతించెను. జాతి స్వత్వ మునుగోలుపోయి అన్యజాత్యాదర్శములు పరిగ్రహించుటచే ఉభయత్రభష్టమగు చున్నది. స్వత్వమా మఱచిపోయినది. అన్యజాత్యాదర్శమా స్వజాతిమాన సిక సంస్థానమునకు సరిపోవు నది కాదు. కావున నే జాత్యుత్సాహమునకు పరిణామము స్వజాతి వ్యక్తిని బలపఱచుకొనుటయేయని విన్న వించియుంటిమి. అట్లే ఐరోపా హైందవ నాగరికతలు రెండును బలపడి అన్యోన్యా త్కృష్ట్యద్యోతకములుగాను, అన్యోన్యలోప పూరణములుగా నుండుటయే ఈ రెంటి సంఘర్షణకును పరిణామము. హైంద పూద్యోగము బలహీనయైయుండుటకు ప్రబల కారణములలో రెండవ దీయాందోళనము ఆంగ్లేయ భాషయందు * జరుగుట. ఇది అనివార్యమైన సందర్భమేకాని ఉద్యోగపాటన మునకు మిక్కిలి అనర్థకరము. ఇప్పటికి ముప్పదిమూడుసభలు జఱిగినవి కాని జనసామాన్యమునకు సంపూర్ణ విజ్ఞానము సమ కూరకున్నది. ఈఆందోళనము ఇంగ్లీషు భాషాభిజ్ఞులలో చాల


  • ఇది వ్రాసినపిమ్మట కాంగ్రెసుమహాసభ దేశభాష పక్షపాతియు, సౌమాన్య భాషావాదియు నై నది.`