పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

30 ఆంధ్రమహోద్యమ తత్త్వము. హారికములుగాఁ జేయ మనమొనర్చు ప్రారంభము అశేషజాతి సముద్యోగమైయుండవలెను. ఈ ప్రయత్నమునందు మనకు జాతీయమనోనిశ్చయమును, సాత్విక నిరోధములును సుఫలదా యకములు, జాతీయోత్సాహప్రకంపను ప్రేరేపించి, ఒక్కొ క్కని హృదయాంతరాళమందును మాఱు మ్రోగునట్లో సర్ప వలెను. దేశ భాషయందు మనయువకులకు ఆదరమును గౌర వమును హెచ్చునట్లు దేశభాషాపండితులను కవిశిఖామణు లను సన్మానించి, దేశభాషలయందు సారస్వతము నభివృద్ధి పఱుచుటయేకాక, సర్వజనలభ్యముగా నొనర్పవలెను. దేశ భాష లింగ్లీషుతో దీటుగావను దుర్మోహమును విఱియునట్లో నర్పవలయును. ఇదంతయు మనము చేయగలిగిన పనియే. ఈ ప్ర యత్న మిపుడు ఆంధ్రసీమయందు జరుగుచునేయున్నది. ఆం ధ్రులహృదయము లుత్సాహపూరితములై ఆంధ్రభాషయందు వ్యవసాయమున కభిముఖములగుచున్నవి. కాని ఇంతను కైనది వలసినదానిలో సహస్రాంశమును గాదు. ప్రతియాంధ్రునకును తన భాషయందు పరిచయమును, సారస్వతమందు శ్రద్ధయు, భాషాభిజ్ఞులయందు గౌరవమును సోదర భావము'ను జనించువఱ కును మనమీభాషాపక్షపాతమగు నాందోళనము జఱుప వలెను. ఇంతవఱకును మనమంతరాయములేక జఱుపఁగలిగినదే. దీనితో సమకాలికముగ మరొక కార్యము పూనుకొనవలెను. అ దేదన పర భాషలయందు వ్యాసంగమును, ఆసక్తియు తగ్గించుట ఈవ్యాసంగము దేశ శేషేమమున కనుకూలమేగాని మనకిప్పు డుండుదాని ప్రమాణముఁజూడ నది అష్టమవ్యస్థానముగా నయి

ఆంధ్రమహోద్యమము. 3- నట్లు తోచుచున్నది. ఈ కార్యమున మనకు కొన్ని సహాయకా రులైన అంశములుగలవు. అన్యభాష నభ్యసించు వారిసంఖ్య మెండుగుటచే వారియందు గలుగు అనాదరణము మొదటిది. వీంరదఱికిని రాజ సేవదొరకమీ రెండవది. వీనిహాయ్యము గొనుచు, మనమాందోళనము చేయుచుండ, అంగ్ల భాషకంటే దేశ భాష లే యుత్కృష్టములని మన వారిమనముల నాటుకొనుస్థితికి శీఘ్రకాల ములోనే వచ్చెదము. ప్రభుత్వము వారితో వ్యవహారము జఱుపు సమయమున తప్ప ప్రతివిషయమునందును మనకు దేశ భాష లే భావద్యోతకములగు అవస్థ బొందుదుము. జాతీయ మనోనిశ్చయమునకు సత్వము గలుగును. ఇదియే మనకు తర కార్యములకు సాధనము. మనకు గమ్యస్థానము పిమ్మటసుగ మము. జాతీయమనోనిశ్చయము సహాయమున మనము పర భా పాన్యవసాయకుల సంఖ్య తగ్గించఁగలుగుదుము. జాతివారం తయు వారిని నిరాదర భావముతోఁ జూచినఁజాలును, జాతీయందు సమ్మానముగలుగనిని యేగదా వారికి పరవిద్యలయం దభినివేశ ము.అట్లుకానినాను వారు వాని తెఱవై నను బోవుటయ సంభవము ఇంగ్లీషు చదువక పోవుట రాజద్రోహము కాదుగదా ? అందుచే మనము ప్రభుత్వమువారియెడ అనపరాధులమయ్యు కార్యము సాధింపగల్గుదుము. ఆంగ్ల భాషావ్యవసాయకులు లేకపోయినను వారిసంఖ్యతగ్గి నను ప్రభుత్వమువారు తెలుఁగునే వ్యావహారిక భాషగా సంగీకరింపకతప్పదు. విధిలేదు. ఇదియే ఆంధ్రోధ్యమ ముయొక్క అంతస్సారము. దీనికి జాతీయమనో నిశ్చయము బల ము, ఆంధ్రప్రత్యేక రాష్ట్ర ముపకరణము. ఆంధ్రజాతిసముద్దర ణము, తన్మూలమున దేశోద్ధరణమును పరిణామములు.