పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3k ఆంధ్రమహోద్యమ తత్త్వము. వ్యావహారిక భాషగాను ఒనర్పఁగలమనియు, అందుచే మనయువ కులకు ఇంగ్లీషు చేర్చుకొనుటకుబట్టు ఇరువది సంవత్సరములు ఆయుస్సు వారికిఁబోసిన వారమేకాక, భాషావ్యక్తియు, జాతీయ వ్యక్తియు దినదినప్రవర్థమానములై మహాదురో మహాదుర్మోహశృంఖల ముల దెగనఱికి స్వేచ్ఛాజీవనమును ప్రసాదింప, తన్మూలమున మన యాదర్శముల శీఘ్రముగా బడయుదుమనియు, వాని చేరు మార్గము ఇదియేతప్ప వేఱండులేదనియు ఆంధ్రులగు మన యాశయము. కాని ఇదెంత దుర్ఘటమైన కార్యము ? దీనిని చేయుట కాదుగదా, తల పెట్టుటగూడ ఇప్పటి మనదుస్థితియంను సాహ సముగాతో చెడిని. తెనుగును ( మఱి యే దేశ భాషనుగాన్ని వ్యావ హారికి భాషగా నొనర్చినచో మనము ఇంగ్లీషు భాషను విడిచి బ్రతుకు పెట్లను వారును, దొరతనపువా రింగ్లీషువారై యుండ ఇ దెట్లు సాధ్యమగునను వారును, నూట యేబది సంవత్సరము లుగా నింగ్లీషు విద్యావ్యవసాయముచే మనము నవనాగరకుల మగుచుండ నిప్పుడేలా వెనుకంజ వేసి గ్రామ్యజానపదులము గావ లెనను వారును, దేశ భాషలందు నవీన శాస్త్రములు మొద లైనవి లేవే, మనయభివృద్ధి యెట్లు చేకురు ననువారును, బూదు మిక్కిలి ఆంగ్లేయ భాషాభ్యసనమున మనము మునసబులును, జడ్జీలును, డిష్టీక లెక్టరులునై, ఇపుడు దానిఁబోనాడఁజూచుట కృతఘ్నతయనువారును, జనులు బహుభంగులై యున్నారు. దీనికంతయు కారణమొక్కటియే. హృదయ దౌర్భల్యము.

అట్టివారందఱకును కృష్ణుఁ డర్జునునకు జెప్పిన యుపదేశముఁ జేయవలెను.

కుతస్త్వా కశ్మల మిదం వివ యే సముపస్థితమ్ | ఆచార్యజుష్ట మస్వర్గ్య | మపకీర్తికర మర్జునః క్లైబ్యంమాస్మగమః పార్థ నైతత్వ య్యుపపద్యతే ముద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వావ పరంతప

ఏకార్యమైన నిదియగునాయని వెనుకకు విఱుచుకొని పడిన నదియగుట దుర్ల భము, ఉత్సాహము, ప్రారంభము, పౌరు షము ఈ మూటిని పాటించి మానవుఁడు ఫలోదయమును గాంచ పలెను. దేశ భాషలను వ్యావహారిక భాషలుగా నొనర్చుటకు మన కెన్ని యో అంతరాయములు గలవు. కాని ఈ కార్యము సాధిం పలేమనుట పొట్టిఁబాటు. ఇంగ్లీ షువిడిచి బ్రతుక లేమనుట అంత కంటెను పొఱఁబాటు. విదుమిక్కిలి ఇంగ్లీ షు భాష విడువక పోయిన మనజాతి చాల కాలము జీవించుట దుర్ఘటము. మన ఈయుద్యోగమందు ప్రభుత్వమువారు సానుభూతి చూపింపరనియే తోచుచున్నది. వారు చూపినను, లేక పోయినను వారిసహాయ మితర విషయములందున లెనే మన మపేక్షింపక జాతీయ సత్వము నే నమ్ముకొని కార్యధోరణికింగడంగుట యుత్త మపక్షము, జాతీయ సముద్ధర ణ దీక్ష వహించిన వారు స్వబలము చేతనే కార్యముల సమర్థింపయత్నించవలెను. పరసహాయ్యా పేX. "పెట్టుకొనియుండినన్నాళ్లు మనకు ముక్తిగలుగ నేరదు. మన ప్రయత్నములకు ప్రతిపతుల సహాయమున కెదురుచూఁడ కుండుట యేకాక, వారివలనఁగలుగు అంతరాయముల బేధించు బలము సహిత ముండవలెను. అందువలన దేశభాషల వ్యావ