పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రమహోద్యమ తత్త్వము. మాదిరి గొట్టము పెట్టినను పొగవచ్చుచునేయుండునుగాని. రాక కమానదు. మట్టిపాత్రమునందు నీరు బోసి మూత బిగించి క్రింద మంటఁ బెట్టినచో అయ్యది ఆవిరిశక్తిచే బ్రద్దలుచున్న ది. అట్లని మట్టి పాత్రమునుదీసి దానికి బదులు బంగారుదిగాని, యినుపది గాని బెట్టినచో పగులకమానునా ? అట్లు అదివిచ్చుటకు కారణ మైన నీటినిగాని, వెలిమంటనుగాని తొలగింపవలెను. అంత వఱ కెన్ని పాట్లుబడినను, పాత్రమునిచ్చెనని యెన్ని విధముల విల పించినను నిష్ప్రయోజనము. అటే ఒక సందర్భ సన్ని వేశమున ఒక కారణ మొకఫలమిచ్చిన అదేసందర్భముల నదే కారణము వేటొక ఫలము నెన్ని ప్రయత్నములు నియ్యజాలదు. కావున మన దేశమందు దుర్మోహమునకు మూలమైన భాషాసందర్భముల నేర్పఱచి (ఆంగ్లేయమును వ్యావహారిక భాష గానుంచి), వానిని మార్చక, మనమిపుడు విచారపడు దేశభాషా దైన్యమును బో నాడవలెనని మనవారు విశ్వవిద్యాలయములందు జేయు కార్య ములెల్ల ను నిరర్థకములు, మతిమాంద్యమూలములును. విద్యా ర్థికి తనయావజ్జీవ పర్యంతమును ఇంగ్లీషు భాషయే వ్యవహార ములయం దేడుగడయనియు, అయ్యదిరాన్నాడు తాను జీవయా త్రఁజేయుట కష్టమనియు దృఢనమ్మకముఁ గలిగియుండ నిష్ప యోజనకారియై, దుర్మోహపరవశుఁడైన అతని దృష్టికి మూక "భాషగా గోచరించు దేశ భాషయందు శ్రద్ధ యేరీతిని జనించును? మన మొక వేళ ఆందోళనము చేసి దేశ భాషా పఠనమే దేశ సేవ యని బోధించినను ఆయాందోళనమున కీ సందర్భముల నెంత ఫలము గలుగవచ్చునో సంతియ కాని విశేషించి రాదు. అదియు మనమిపుడు కన్నులారఁ జూచుచునేయున్నారము. దేశభాషా

3x ఆంధ్ర మహోద్యము తత్వము. పక్షపాతియైన యాందోళనము జఱిగిన బంగాళాంధ్ర దేశ ఋల దేశ భాషల విద్యార్థుల శ్రద్ధఁ జూడుఁడు. ఏమియు లేని యరవదేశ మున జూడుఁడు. పూర్వరాష్ట్రములయం దాందోళన ఫలము తెలి యుచునేయున్నది. కాని సందర్భములన్నియు ప్రతికూలమలగు టచే ఆందోళనమునకు తగిన ఫలము కలుగలేదు. ఏలననగా మనము కారణముల నిర్మూలింపక 'అదితీసింది, ఇది తీసి యది మార్చుచున్నారము. ప్రధమభాష తెనుగుగా నేర్పిన గూడ తెనుగునకు మంచిదినములు రావు. దుర్మోహము చిఱియదు. దుర్మోహమును ధ్వంసముజేయవలెనన్న తెను గును వ్యావహారిక భాషగా సనర్చవలెను. దేశ భాషను ప్రథ మభాషగా నొనర్చుటయే రెండు భాషల వారిని జోడించిన రాజ్య మందు మిక్కిలి కష్టము. అట్లుండ వ్యావహారిక భాషగా కొన ర్చుట అట్టిరాజ్యముందు మఱింత దుస్సాధ్యమేకాక, అసా ధ్యము సైతమగును. రాజ్యమునం దొకమూలనుండి మఱి యొక మూలకు రాకపోకలు జఱుగుచుండ వ్యావహారిక భాషలు రెండగుటఁ బరస్పరము స్పర్ధించును. అట్టిస్పర్ధ చేసేవి పరస్పరము జంపుకొని మాడవదగు అన్య భాష స్వేచ్ఛావిలసనమున కెడ మిచ్చి తాము నశించును. దేష భాషల వ్యావహారిక భాషలుగా జేసినగాని దుర్మోహము నశింపదనియు, అయ్యది నశించిన గాని దేశ క్షేమము సమకూరదనియు నిదివఱ కే నుడివియుంటిమి. కావుననే ఆంధ్రులు ఇరు బాసల వారికిని క్షేమముగలుగు తెఱగువిచారించి చెన్న రాజ్యమును ఆంధ్ర ద్రవిడ రాష్ట్రములుగా ద్వైధీకరింపుముని ఆందోళనము సేయుట. ఆంధ్రరాష్ట్రమును విడ దీసినచో ఇతరలాభములటుండ తెనుగును ప్రధాన భాషగాను,