పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రమహోద్యమ తత్త్వము. స్వయంగా రవిషయమునగాని కొంత యజ్ఞానముండ నేయుండును. ఆర్థి క 'విషయమునశక్తిత్రయములో ప్రధానమగు నుత్సాహశక్తికి సజాతీయములగు ధైర్య స్థైర్యశౌర్యాది గుణ ములు మన స్తత్వసంబంధులుగావున నీ పక్షమున స్వాతిశయ భావము, పరబలతృణీకరణము నను రాజ సగుణజన్యములైన భావ విశేష పోషకమగు నాతో నాత్మోత్కృష్ణతా బుద్ది గలిగియుండుట సమ్మోహమగును. అద్దానివిపరీతములగు నైచ్యదైన్య హైన్య దౌర్బల్య ధీరత్వాదులైన అర్థనాశక గుణోత్పాదకములగు తామసగుణజన్య భావ విశేషములచే హృదయమాక్రమింప బడుట దుర్మోహమగును. అతిశయ భానముగాని, దీనభావము గాని లేకుండుట విమోహమని చెప్పనగును. పూర్ణ జ్ఞానపరిపాక రూపనుగు విమోహస్థితివిషయము ద్వంద్వాతీతమై సామాన్యముగ లోకో త్వరాంశ మగుటచే నార్థిక విషయముల ననినటుంచుదము. పై వివరించిన రీతిని ఆర్థికప్రకరణమున సామర్థ్యసంపాదకమగు సమ్మోహమును, అసామర్థ్యతా ప్రభనమగు దుర్మోహమును నిరంతము జనుల యొక్కయు, జాతులయొక్కయు మనముల నావరించి వారి యభివృద్ధివినాశములకు మూలాధారమై పనిచేయుచునేయుం డును, సమ్మోహదుర్మోహములు రెండును ఆరోపణచే గలుగు "నవియే అయియున్నవి. ఈయారోపణ స్వకృతమైనను గా వచ్చును. పరకృతమైనను గావచ్చును. కాని సామాన్యముగా పరమూలకారంభమైన ఆత్మమూలకావసాన మగుచున్నది. 1. Politics.

ఆంధ్రమహోద్యమ తత్త్వము, ఆరోపణ విద్య యొక్క స్వభావమును, మహిమమును ఇంచుక తేటపఱచినగాని ప్రకృతవిషయమున దానివలనఁ గలుగు లాభనష్టములు సంపూర్ణముగ తెలియరావు. మనస్సునకు గొప్పదుర్గుణ మొకటిగలదు. పదిమారు లే దేనియొక యభిప్రాయ మును పట్టుదలగానారోపించుచుండిన యెడల అట్టియభిప్రాయ మును నిశ్చితముగా నదిస్వీకరించును. అట్టియభిప్రాయము యు_క్తీయు క్తముగాగాని, వా స్తవముగాగాని ఉండవలయునను అవసరములేదు. ఎంతదురభిప్రాయమైనను అదియు_క్తియు క్తము గను, నిర్వివాదముగను దోచును. ఇందుకు వేన వేలుగ నుదా హరణములీయవచ్చును. హిందువులకు విగ్రహారాధన యంత ఉపయు క్తమగు విషయము లేదనుట కరతలామలకముగ దోచు ను. కాని క్రైస్తవులకును, మహమ్మదీయులకును అయ్యది. దూష్యమనువిషయమునిక్వివాదాంశము. పినతండ్రికొమా ర్తెను వివాహమాడుట దూష్యమనువిషయమున హిందువులకు సందే హములేదు. దానికి కారణము వారారయబోరు. మహమ్మ దీయులకంతకంటె సొబగైనట్టియు, న్యాయమైనట్టియు విషయ ముదోచదు. సకలజీవరాశియు మనుష్యుని కెద్ది రె యో యొక ఉప యోగమునకై దేవుఁడు సృజించెనని పాశ్చాత్యులు నిర్వివాదము గనమ్ముదురు. అదివిపరీతముగను, హాస్యాస్పదముగను, ప్రాచ్యు లకు నిర్వివాదముగ దోచును. ఈ విధమైన నమ్మకములును, ఈ భావములును, శైశవముమాదిగా పరిసరములనుండి గ్రహించిన ఆరోపితాంశములే. ఇవి గుణా గుణవివేచనకు విపరీతములై బల వదభిమానములపై తము గల్పించుటకు కారణభూతములైనవి. అట్లే దురభిమానమును గల్పింపగలవు. మానవుని అభ్యున్నతి